ప్యారిస్‌లో నలుగురు అందగత్తెలు..! | four beauties in paris | Sakshi
Sakshi News home page

Nov 4 2017 7:52 PM | Updated on Oct 30 2018 5:58 PM

four beauties in paris - Sakshi

ప్యారిస్‌లో మన బ్యూటీస్‌ సందడి చేస్తున్నారు. వేర్వేరు భాషల్లో రూపొందుతున్న ఒకే చిత్రం రీమేక్‌లో నటిస్తున్న ఈ నలుగురు సౌందర్యరాశులు ఎవరా అంటే? మీకు ఈపాటికే అర్థమై ఉంటుంది.
సాధారణంగా ఒక చిత్రం నాలుగు భాషల్లో ఏకకాలంలో రీమేక్‌ అవడం అన్నది అరుదు. ఆ నాలుగు భాషల్లోనూ షూటింగ్‌ ఒకేసారి ఒకేచోట జరగడం మరింత విశేషమే.

హిందీలో కంగనా రనౌత్‌ నటించి జాతీయ అవార్డును అందుకున్న 'క్వీన్‌' చిత్రం ఇప్పుడు తాజాగా తమిళం, తెలుగు, కన్నడం, మలయాళ భాషల్లో ఏక కాలంలో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. కంగనా పాత్ర తమిళంలో కాజల్‌ అగర్వాల్‌, తెలుగులో తమన్నా, కన్నడంలో ఫరూల్‌ యాదవ్, మలయాళంలో మంజిమామోహన్‌ చేస్తున్నారు. తమిళ, కన్నడ భాషా చిత్రాలకు నటుడు రమేష్‌ అరవింద్, తెలుగు చిత్రానికి నీలకంఠ, మలయాళంలో డిజో జోస్‌ అంటోని దర్శకత్వం వహిస్తున్నారు. ఇలా దర్శకులు వేరైనా, కథానాయికలు వేరైనా చిత్రీకరణ మాత్రం షాట్‌ ఒన్, టేక్స్‌ ఫోర్‌ అంటూ ఏకకాలంలో, ఒకేచోట జరుపుకుంటున్నాయి. దీంతో ఈ ముద్దుగుమ్మలు షూటింగ్‌లో భాగంగా ఇప్పుడు ప్యారిస్‌లో మకాం పెట్టారు.

Advertisement
 
Advertisement
Advertisement