‘అవును..మేము రిలేషన్‌షిప్‌లో ఉన్నాం’

Former Bigg Boss Contestant Nehha Pendse In Love - Sakshi

న్యూఢిల్లీ : పాపులర్‌ రియాలిటీ షో హిందీ ‘బిగ్‌ బాస్‌ 12’లో కంటెస్టెంట్‌, బుల్లితెర నటి నేహా పెండ్సే ప్రేమలో పడింది. ఈ విషయాన్ని స్వయంగా తానే వెల్లడించింది. నేహ తన స్నేహితుడు షార్దూల్‌ సింగ్‌ బయాస్‌తో కలిసి ఉన్న ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసింది. ఫొటోలకు క్యాప్షన్‌గా హార్ట్‌ ఎమోజీని ఉంచింది. ఈ క్రమంలో.. ‘నెటిజన్లు అత్యంత ముచ్చటైన జంట’ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారు. ఈ ఫొటోలో నేహ నిశ్చితార్థపు వేలికి ఉంగరం ఉండటంతో... వీరిద్దరు రహస్యంగా నిశ్చితార్థం చేసుకున్నారని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. దీనిపై నేహా స్పందిస్తూ  ‘ప్రస్తుతానికి మేమిద్దరం రిలేషన్‌షిప్ ఉన్నాం. పెళ్లి ఎప్పుడనేది మాకే స్పష్టత లేదు’ అని ఓ ఇంటర్యూలో వెల్లడించింది. ఇక ప్రముఖ రియాలిటీ షో బిగ్‌​ బాస్‌ 12లో కంటెస్టెంట్‌లు దీపికా కాకర్, కరణ్‌వీర్ బొహ్రాలతో పాటు పాల్గొన్న బుల్లితెర నటి నేహా కూడా ఫేమస్‌ అయ్యారు. కాగా నేహా 1999లో వచ్చిన ‘ప్యార్‌ కోయ్‌ ఖేల్‌ నహీ’ సినిమాతో బాలీవుడ్‌లో తెరంగేట్రం చేసింది. ఆ తర్వాత హిందీ, తమిళం,మలయాళం, కన్నడతో పాటు మరాఠీ సినిమాల్లోనూ కనిపించింది.


❤️

A post shared by NEHHA PENDSE (@nehhapendse) on

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top