సుప్రీం చరిత్రాత్మక తీర్పు : టీవీలో సంచలన షో

This Former Bigg Boss Contestant To Feature In Indian TV First-Ever Gay Swayamvar - Sakshi

స్వలింగ సంపర్కం నేరం కాదంటూ.. సెక్షన్‌ 377ను సవరిస్తూ సుప్రీంకోర్టు కొన్ని రోజుల కిందటే చరిత్రాత్మక తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం తీర్పుపై దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో బుల్లితెర టీవీ కూడా ఈ సంబురాల్లో పాలుపంచుకుంటోంది. బుల్లి తెరపై మొట్ట మొదటిసారి ‘గే స్వయంవరం’ కార్యక్రమం ప్రసారం కాబోతుంది. ఈ షోకు హిందీ బిగ్‌ బాస్‌ 11 కంటెస్టెంట్‌ సవ్యసాచి సత్పతి హోస్ట్‌గా వ్యవహరించబోతున్నాడు. సవ్యసాచి సత్పతి కోసం మంచి ‘గే వరుడు’ కావాలంటూ ఈ గే స్వయంవరం కార్యక్రమం ప్రసారం కానుంది.

‘అవును, రెండు ప్రొడక్షన్‌ హౌజ్‌లతో ప్రస్తుతం చర్చలు కొనసాగుతున్నాయి. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు అనంతరం ఈ షో చేయాలనుకున్నాం. నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. మన టెలివిజన్‌ రియాల్టీ షోల్లో ఇలాంటి కార్యక్రమాలను ఎన్నడూ చూడలేదు. కచ్చితంగా ఈ గే రియాల్టీ స్వయంవరం షో చరిత్ర సృష్టిస్తుంది’ అని సవ్యసాచి అన్నారు. బిగ్‌ బాస్‌ 11 హౌజ్‌ ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న సవ్యసాచి, తనకున్న హాస్య భావనతో హౌజ్‌ మేట్లను ఎల్లప్పుడూ ఎంటర్‌టైన్‌ చేస్తూ ఉండే వాడు. కానీ బాధకరంగా అతను షోలో ఉండేందుకు తగిన ఓట్లు సంపాదించుకోలేక, హౌజ్‌ నుంచి బయటికి వచ్చేశాడు. బిగ్‌ బాస్‌ 11కు ముందు, అతను ఒడిశా టెలివిజన్‌ ఇండస్ట్రిలో ఉండేవాడు. పలు కుకింగ్‌ షోలకు హోస్ట్‌గా వ్యవహరించేవాడు. ఫెమినా మిస్‌ ఇండియా 2017 ఆడిషన్స్‌కు కూడా హోస్ట్‌గా ఉన్నాడు. 

ఇంతకుముందు వివాదాస్పద బాలీవుడ్ నటి రాఖీ సావంత్ కూడా ‘రాఖీకీ స్వయంవర్’ పేరుతో ఓ కార్యక్రమం నిర్వహించింది. అందులో తనకు తానే స్వయంవరం ప్రకటించుకుని, వచ్చిన వారిలో ఓ వరుడిని ఎంచుకుని కొద్దికాలం అతనితో ట్రావెల్ చేసింది. అలాగే ‘రాహుల్ కా స్వయంవర్’ పేరుతో కూడా ఓ టీవీ కార్యక్రమం ప్రసారమైంది. అది తీవ్ర వివాదాస్పదమైంది. వీటితో పోలిస్తే ‘సవ్యసాచి స్వయంవరం’ పూర్తిగా విరుద్ధం. సవ్యసాచి సత్పతి కోసం మంచి హైటు, వెయిటూ ఉన్న గే వరుడు కావాలంటూ కార్యక్రమం రూపొందించబోతున్నారు. భారతదేశంలో గే కల్చర్‌ను చూపిస్తూ ఇంతవరకూ ఇటువంటి కార్యక్రమాలు రూపొందలేదు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top