జీరో టెంపరేచర్‌లో షూటింగ్‌

The Fog Trailer Launch By Tammareddy Bharadwaja - Sakshi

మ్యాజిక్‌ లైట్స్‌ స్టూడియోస్‌ మరియు వర్షి స్టూడియోస్‌ పతాకాలపై రూపొందుతోన్న చిత్రం ‘ద ఫాగ్‌’. యంవీ రెడ్డి నిర్మాత. మధుసూదన్‌ దర్శకునిగా పరిచయం అవుతున్నారు. విరాట్‌ చంద్ర, హరిణి, చందన, ఆత్మనంద తదితరులు ఈ చిత్రం ద్వారా నటీనటులుగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ను దర్శక–నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేయించింది చిత్ర బృందం. ఈ సందర్భంగా తమ్మారెడ్డి మాట్లాడుతూ– ‘‘ట్రైలర్‌ ఇప్పుడే చూశాను. చాలా కొత్తగా ఉంది.

కొత్తగా వచ్చిన కెమెరాలతో ఎటువంటి లైట్స్‌ లేకుండా కొత్త లొకేషన్స్‌లో జీరో టెంపరేచర్‌లో హాలీవుడ్‌ లెవల్‌లో షూట్‌ చేశారు. చిన్న సినిమా అని చెప్తున్నారు కానీ పెద్ద సినిమాలా వుంది. తక్కువ బడ్జెట్‌లో మంచి క్వాలిటీ సినిమా కావాలి. అలా తీస్తే సినిమాకు మంచి లాభం వస్తుంది నా అంచనా. ఈ సినిమా ద్వారా దర్శకుడు మధుసూదన్‌కు, సినిమా పరిశ్రమకు మంచి జరగాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: యల్లనూరు హరినాథ్, సతీశ్‌ రెడ్డి, సంగీతం: సందీప్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top