మహా సస్పెన్స్‌ | First look poster of Hansika's Maha | Sakshi
Sakshi News home page

మహా సస్పెన్స్‌

Dec 10 2018 5:48 AM | Updated on Dec 10 2018 5:48 AM

First look poster of Hansika's Maha - Sakshi

హన్సిక

కథానాయిక హన్సిక ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పదకొండేళ్లు అవుతోంది. తెలుగులో అల్లు అర్జున్‌ హీరోగా నటించిన ‘దేశముదురు’ సినిమాతో ఆమె హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఈ 11ఏళ్ల కాలంలో ఆమె ఎన్నో డిఫరెంట్‌ పాత్రలు చేశారు. మోహన్‌లాల్‌ నటించిన మలయాళ చిత్రం ‘విలన్‌’లో నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌ కూడా చేశారామె. ఇప్పుడు హన్సిక ప్రధాన పాత్రలో రూపొందుతోన్న లేడీ ఓరియంటెడ్‌ మూవీ ‘మహా’.

హాన్సిక నటిస్తున్న 50వ చిత్రం ఇది. యూఆర్‌. జెమిల్‌ ఈ సినిమాతో దర్శకునిగా పరిచయం అవుతున్నారు. సస్పెన్స్‌ థ్రిల్లర్‌ బ్యాక్‌డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఒక పోస్టర్‌లో మాస్క్‌లను చేతిలో పట్టుకుని, మరో పోస్టర్‌లో కుర్చీలో కూర్చొని ధూమపానం చేస్తున్న పోజుతో హన్సిక రెండు రకాలుగా కనిపించారు. ఈ సినిమా కాకుండా ‘100, తుపాకీ మునై’ హన్సిక నటించిన చిత్రాలు. ‘తుపాకీ మున్నై’ ఈ నెల 14న విడుదల కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement