వరలక్షి చిత్రం సేల్‌ అయ్యింది!

Finally varalaxmi sarathkumar Cinema Saled - Sakshi

తమిళసినిమా: వరలక్ష్మీ చిత్రం అమ్ముడు పోయింది అంటే ఇదేదో చిత్ర టైటిల్‌ అనుకుంటే పప్పులో కాలేసినట్లే. నటి వరలక్ష్మీశరత్‌కుమార్‌ నటించిన హెచ్చరికై ఇదు మనిదర్‌గళ్‌ నడమాడుం ఇడం మొత్తంగా  అమ్ముడు పోయింది. ఈరోజుల్లో చిత్రం నిర్మించడం సులభమే కానీ, దాన్ని విడుదల చేయడానికి నానా కష్టాలు పడాల్సి వస్తోంది. సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు దొరకడం అన్నది ఆక్సిజన్‌ లాంటిదే. అలా కొనేవారు లేక చాలా చిత్రాలు అటకెక్కుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో హెచ్చరికై ఇది మనిదర్‌గళ్‌ నడమాడుం ఇడం చిత్రం చూసిన క్లాప్‌ బోర్డు సంస్థ అధినేత వి.సత్యమూర్తి చాలా బాగుందని ప్రశంసిండంతో పాటు చిత్ర విడుదల హక్కులను మొత్తంగా కొనేశారు. ఆయన ఇంతకు ముందు తప్పుదండా చిత్రం ద్వారా హీరోగా, నిర్మాతగానూ పరిచయం అయ్యారన్నది గమనార్హం. సుశీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన నెంజిల్‌ తునిచ్చల్‌ ఇరుందాల్, విజయ్‌సేతుపతి హీరోగా నటించిన ఒరు నల్లనాళ్‌ పార్తు సొల్రేన్‌ చిత్రాల విడుదల హక్కులను పొంది విడుదల చేశారు. తాజాగా సత్యరాజ్‌ రిటైర్డ్‌ పోలీసు అధికారిగా ప్రధాన పాత్రలో నటించిన హెచ్చరికై ఇదు మనిదర్‌గళ్‌ నడమాడుమ్‌ ఇడమ్‌ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేశారు.

నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని సీపీ.గణేశ్, సుందర్‌ అన్నామలై కలిసి నిర్మించారు. కథ, దర్శకత్వం బాధ్యతలను సర్జన్‌ నిర్వహించారు. ఈయన మణిరత్నం, ఏఆర్‌.మురుగదాస్‌ల వద్ద సహాయదర్శకుడిగా పనిచేశారు. అంతే కాదు యూ ట్యూబ్‌లో ప్రాచుర్యం పొందిన మా, లక్ష్మీ చిత్రాల దర్శకుడు ఈయనే. చిత్ర వివరాలను ఆయన తెలుపుతూ కిడ్నాప్‌ ఇతివృత్తంతో తెరకెక్కించిన సస్పెన్స్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా హెచ్చరికై ఇదు మనిదర్‌గళ్‌ నడమాడుమ్‌ ఇడమ్‌ ఉంటుందన్నారు. ఇందులో రిటైర్డ్‌ పోలీస్‌అధికారిగా సత్యరాజ్‌ దుమ్మురేపుతారని చెప్పారు. దీనికి కేఎస్‌.సుందరమూర్తి సంగీతాన్ని, సుదర్శన్‌ శ్రీనివాసన్‌ ఛాయాగ్రహణం అందించినట్లు తెలిపారు. చిత్రాన్ని త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. ఈ చిత్ర విడుదల హక్కులను కొనుగోలు చేని సత్యమూర్తి తన క్లాప్‌బోర్డు ప్రొడక్షన్స్‌ పతాకంపై తాజాగా నిర్మిస్తున్న ఓడవుమ్‌ ముడియాదు ఒళియవుమ్‌ ముడియాదు చిత్ర షూటింగ్‌ పూర్తి అయ్యింది. త్వరలో ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top