దర్శకుడు గౌతమ్ మీనన్ పై కేసు నమోదు | Filmmaker Gautham Menon faces legal trouble | Sakshi
Sakshi News home page

దర్శకుడు గౌతమ్ మీనన్ పై కేసు నమోదు

Jan 12 2014 6:42 PM | Updated on Oct 8 2018 3:56 PM

చీటింగ్ కేసులో గౌతమ్ మీనన్ తోపాటు ఫోటాన్ కథాస్ హౌజ్ ప్రోడక్షన్ కు చెందిన మరో నలుగురిపై కేసు నమోదు చేయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ను శనివారం మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.

తమిళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ కోర్టు కేసుల్లో చిక్కుకున్నారు. చీటింగ్ కేసులో గౌతమ్ మీనన్ తోపాటు ఫోటాన్ కథాస్ హౌజ్ ప్రోడక్షన్ కు చెందిన మరో నలుగురిపై కేసు నమోదు చేయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ ను శనివారం మద్రాస్ హైకోర్టు ఆదేశించింది.
 
విన్నైతాండి విరువాయ చిత్రం రీమేక్ రూపొందిన 'ఏక్ దివానా థా' చిత్రానికి సంబంధించిన ఆర్దిక వ్యవహారాల్లో సుమారు 9 కోట్ల రూపాయల మేరకు తన క్లయింట్ జయరామన్ ను చీట్ చేశారని ఆయన తరపు న్యాయవాది బి రమేశ్ బాబు తెలిపారు.
 
ఫిర్యాదుదారు దాఖలు చేసిన పిటిషన్ ను మద్రాస్ హై కోర్టు జస్టిస్ సీటీ సెల్వమ్ విచారించారు. ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాలని సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డిప్యూటి కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. 
 

Advertisement
 
Advertisement
Advertisement