కరోనాపై పోరాటం: సూపర్‌ స్టార్ల షార్ట్‌ఫిల్మ్‌

Film Industry Celebrities Family Short Film About Importance Of self Isolation - Sakshi

కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు అన్ని ఇండస్ట్రీలకు చెందిన సెలబ్రిటీలు ఏకతాటిపై వచ్చారు. ఇప్పటికే కరోనాపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు ప్రముఖులు అంతా వీడియోలు చేసి అభిమానలుతో పంచుకోగా.. తాజాగా మరో ముందడుగు వేసి సందేశాత్మక షార్ట్‌ ఫిల్మ్‌ రూపొందించారు. ‘ది ఫ్యామిలీ’ అనే లఘు చిత్రాన్ని రూపొందించి మనల్ని అలరించనున్నారు. ప్రసూన్‌ పాండే దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తెలుగు, తమిళ్‌, బాలీవుడ్‌ సూపర్‌ స్టార్లందరూ నటించారు. ఈ సినిమాను సోమవారం రాత్రి తొమ్మిది గంటలకు సోనీ నెట్‌వర్క్‌లో ప్రసారం అయ్యింది.  (దేశం కోసం ఓ మంచి పని చేద్దాం : కాజల్‌)

అమితాబ్‌ బచ్చన్‌, మెగాస్టార్‌ చిరంజీవి, మమ్ముట్టి, మోహన్‌ లాల్‌, సూపర్‌ స్టార్‌ రజినీకాంత్‌, శివరాజ్‌ కుమార్‌, దిల్జిత్ దోసంజ్, రణ్‌బీర్‌ కపూర్‌, అలియా భట్‌, ప్రియాంక చోప్రా నటిస్తున్న ఈ సినిమాలో కరోనాను దరి చేరనివ్వకుండా ఇంట్లోనే ఉండాలన్న ఆవశ్యకతను వివరించారు. అలాగే సినీ ఇండస్ట్రీ కార్మికులు లాక్‌డౌన్‌ కాలంలో ఏలాంటి ఇబ్బందులు పడుతున్నారో చిత్రీకరించారు. ఈ సినిమా కథ బిగ్‌బీ కళ్లజోడు పొగొట్టుకున్న సన్నివేశం నుంచి ప్రారంభం అవుతుంది. వీటిని వెతికి పట్టుకునేందుకు తోటి తారలంతా ప్రయత్నిస్తారు. అయితే ఈ వీడియోలో సెలబ్రిటీలంతా వారి వారి మాతృభాషలో మాట్లాడటం విశేషం. (నెటిజన్ల ఆగ్రహానికి గురైన కిరణ్‌ బేడీ)

చివర్లో అమితాబ్ మాట్లాడుతూ ... ‘మనమందరం కలిసే ఈ సినిమా చేశాం. కానీ ఇందుకు ఎవరూ కూడా ఇంటి నుంచి బయటకు రాలేదు. ఇంట్లో నుంచే ఈ వీడియో  చేశాం. వున మీరు కూడా దయచేసి ఇంట్లోనే ఉండండి. ఈ ప్రమాదకరమైన వైరస్ నుంచి మిమ్మల్ని మీరు సురక్షితంగా ఉంచుకోడానికి ఇదోక్కడే మార్గం.. ఇంట్లోనే ఉండండి, సురక్షితంగా ఉండండి. అంటూ చెప్పుకొచ్చారు’. అలాగే "మేము ఈ చిత్రాన్ని రూపొందించడానికి మరో కారణం ఉంది. మనమంతా భారతీయ చిత్ర పరిశ్రమలో కుటుంబ సభ్యులం. కానీ మాకు మద్దతు ఇచ్చే, మాతో కలిసి పనిచేసే మరో పెద్ద కుటుంబం ఉంది.  వాళ్లే.. సినీ కార్మికులు. రోజువారీ వేతన సిబ్బంది. వీరంతా లాక్‌డౌన్‌ కారణంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మనమందరం కలిసి వీరి కోసం నిధులు సేకరించడానికి టీవీ ఛానల్‌, స్పాన్సర్ల ద్వారా ఏకమయ్యాం. దీని ద్వారా వచ్చే ఆదాయాన్ని సినీ కార్మికులకు పంపిణీ చేస్తున్నాం. ఈ కఠినమైన సమయాల్లో ఈ డబ్బు వారికి కొంత ఉపశమనం లభిస్తుంది. (బాయ్‌ఫ్రెండ్‌ దగ్గరికి వెళ్లాలి... అనుమతివ్వండి)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

మరిన్ని వార్తలు

28-11-2020
Nov 28, 2020, 11:13 IST
మహారాష్ట్ర: కరోనా బారిన పడి నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే భారత్‌ భాల్కే మరణించారు. పుణేలోని రబీ ఆస్పత్రిలో శుక్రవారం నుంచి...
28-11-2020
Nov 28, 2020, 08:23 IST
బీజింగ్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ గురించి మరో కొత్త విషయం బయటపడింది. శరీరం మొత్తం వ్యాపించేందుకు కరోనా వైరస్‌ మన...
28-11-2020
Nov 28, 2020, 04:53 IST
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కరోనా వ్యాధి నిర్ధారణకు అభివృద్ధి...
28-11-2020
Nov 28, 2020, 04:26 IST
న్యూఢిల్లీ: కరోనా కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సుప్రీం కోర్టు శుక్రవారం కేంద్రానికి ఆదేశాలు...
28-11-2020
Nov 28, 2020, 03:27 IST
సాక్షి, అమరావతి: కోవిడ్‌–19 నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలను నీతి ఆయోగ్‌ ప్రశంసించింది. ముందు చూపుతో వ్యవహరించి వైరస్‌...
27-11-2020
Nov 27, 2020, 17:34 IST
న్యూఢిల్లీ: భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య వ్యాక్సిన్‌ డీల్‌ కుదిరింది. పొరుగు దేశానికి మూడు కోట్ల వ్యాక్సిన్‌ డోసులు సరఫరా చేసేందుకు...
27-11-2020
Nov 27, 2020, 13:50 IST
మాస్కో/ హైదరాబాద్‌: దేశీయంగా రష్యన్‌ వ్యాక్సిన్‌ తయారీకి హైదరాబాద్‌ ఫార్మా కంపెనీ హెటెరో డ్రగ్స్‌ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. రష్యన్‌ డైరెక్ట్‌...
27-11-2020
Nov 27, 2020, 11:47 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో నమోదైన మొత్తం కరోనా కేసులు 93లక్షలు దాటేసింది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 43,082 కోవిడ్‌...
27-11-2020
Nov 27, 2020, 10:44 IST
న్యూఢిల్లీ, సాక్షి: కరోనా వైరస్‌ కట్టడికి వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చినప్పటికీ తాను తీసుకోబోనని బ్రెజిల్‌ అధ్యక్షుడు జైర్ బోల్సొనారో తాజాగా స్పష్టం...
27-11-2020
Nov 27, 2020, 09:26 IST
ముంబై, సాక్షి: అన్నీ అనుకున్నట్లు జరిగితే.. వచ్చే మార్చికల్లా కోవిడ్‌-19 కట్టడికి వ్యాక్సిన్‌ను విడుదల చేసే వీలున్నట్లు దేశీ ఫార్మా...
27-11-2020
Nov 27, 2020, 08:22 IST
అహ్మదాబాద్‌: గుజరాత్‌లో విషాదం చోటుచేసుకుంది. రాజ్‌కోట్‌లోని కోవిడ్‌ ఆస్పత్రిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఐదురుగు కరోనా పేషెంట్లు...
27-11-2020
Nov 27, 2020, 08:05 IST
సాక్షి, హైదరాబాద్‌ : రోజూ 50 వేల కరోనా పరీక్షలు, వారానికోసారి లక్ష పరీక్షలు చేయాలన్న తమ ఆదేశాలను అమలు...
26-11-2020
Nov 26, 2020, 19:24 IST
‘‘ఇది సాధారణ సంవత్సరమయ్యుంటే ఇది ఒక మంచి కథలా మిగిలిపోయేది. ప్రస్తుతమున్న పరిస్థితులను బట్టి చూస్తే ఇది ఒక గొప్ప...
26-11-2020
Nov 26, 2020, 16:35 IST
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న సమయంలో ఫేస్‌మాస్క్‌ ధరించడం అనివార్యంగా మారిపోయింది.
26-11-2020
Nov 26, 2020, 13:30 IST
న్యూయార్క్‌: కరోనా వైరస్‌ కట్టికి బ్రిటిష్‌, స్వీడిష్‌ ఫార్మా దిగ్గజం ఆస్ట్రాజెనకా రూపొందిస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో పొరపాటు దొర్లినట్లు తాజాగా ఆక్స్‌ఫర్డ్‌...
26-11-2020
Nov 26, 2020, 13:11 IST
సాక్షి, న్యూఢిల్లీ: ఈ–కామర్స్‌ అమ్మకాలకు కరోనా వైరస్‌ కలిసొచ్చింది. గతేడాది పండుగ సీజన్‌తో పోలిస్తే ఈ ఏడాది ఫెస్టివల్‌ సీజన్‌లో...
26-11-2020
Nov 26, 2020, 12:07 IST
సింగపూర్: కోవిడ్ -19 వ్యాప్తిని అరికట్టడానికి ఉపయోగించే మాస్క్‌ తయారీలో వాడే పదార్థాలు, దాని రూపకల్పన, పొడవు తదితర అంశాలు...
26-11-2020
Nov 26, 2020, 10:02 IST
సాక్షి, ముంబై : రాష్ట్ర వ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో లాక్‌డౌన్‌ విధించే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తుండటంతో...
26-11-2020
Nov 26, 2020, 09:54 IST
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 44,489 కోవిడ్‌ పాజిటివ్‌ కేసులు వెలుగుచూశాయి....
26-11-2020
Nov 26, 2020, 08:25 IST
భోపాల్‌: కరోనా రోగులకు చికిత్స అందించే క్రమంలో మహమ్మారి బారిన పడిన ఓ యువ వైద్యుడు కన్నుమూశాడు. నెలరోజుల పాటు...
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top