మే 31న `ఫ‌ల‌క్‌నుమా దాస్‌` 

Falaknuma Das Movie Release On 31st May - Sakshi

విశ్వ‌క్ సేన్ హీరోగా న‌టిస్తూ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్రం `ఫ‌ల‌క్‌నుమా దాస్‌`. వాజ్ఞ్మ‌యి క్రియేష‌న్స్ క‌రాటే రాజు స‌మ‌ర్ప‌ణ‌లో విశ్వ‌క్ సేన్ సినిమాస్‌, టెర్ర‌నోవా పిక్చ‌ర్స్ బ్యాన‌ర్స్‌పై ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మీడియా 9 మ‌నోజ్‌కుమార్ కో ప్రొడ్యూస‌ర్‌. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల్ని  పూర్తి చేసుకున్న ఈ సినిమాను మే 31న విడుద‌ల చేస్తున్నారు. ఈ మేరకు మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు. ఈ సమావేశంలో హీరో విశ్వక్ సేన్, హీరోయిన్ సలోని మిశ్రా, తరుణ్ భాస్కర్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.  

ఈ సంద‌ర్భంగా  హీరో, ద‌ర్శ‌కుడు విశ్వక్ సేన్ మాట్లాడుతూ `సినిమా ను ఇటీవల 100 మంది దాకా చూశారు. చూసిన వాళ్లంతా సినిమా బాగుందని ప్రశంసలు కురిపించారు. తప్పకుండా అందరికీ నచుతుంది. మే 31న సినిమాను రిలీజ్ చేస్తున్నాం` అన్నారు. అనంతరం  తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ `నేను ఇందులో నటించా. మొదట్లో విశ్వక్ మీద నమ్మకం లేదు. కానీ ఓ షార్ట్ ఫిల్మ్ చూపించారు. అప్పుడు విశ్వాక్ మీద నమ్మకం కలిగింది. ఇది మలయాళం సినిమా కి రీమేక్ అని తెలిసిందే`అన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top