ఆయన నుంచి ఆ ఒక్కటి తెలుసుకోవాలి! | Exclusive Interview with Anegan Movie heroines Amyra Dastur | Sakshi
Sakshi News home page

ఆయన నుంచి ఆ ఒక్కటి తెలుసుకోవాలి!

Feb 19 2017 2:05 AM | Updated on Apr 8 2019 7:50 PM

ఆయన నుంచి ఆ ఒక్కటి తెలుసుకోవాలి! - Sakshi

ఆయన నుంచి ఆ ఒక్కటి తెలుసుకోవాలి!

ఆయన నుంచి ఆ ఒక్కటీ తెలుసుకోవాలని ఉంది అంటోంది నటి అమిర. ఆ మధ్య ధనుష్‌కు జంటగా అనేగన్‌ చిత్రం

ఆయన నుంచి ఆ ఒక్కటీ తెలుసుకోవాలని ఉంది అంటోంది నటి అమిర. ఆ మధ్య ధనుష్‌కు జంటగా అనేగన్‌ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయి న ఉత్తరాది భామ ఈ జాణ. ఇంతకీ ఈ అమ్మడి గురించి ఇప్పుడెందుకు ప్రస్థావిస్తున్నారనేగా మీ ప్రశ్న?ఈ బ్యూటీ తాజాగా హాస్య కథానాయకుడు సంతానంతో ఓడి ఓడి ఉళైక్కనుమ్‌ చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరిని ఆ ఒక్కటీ అడగాలనుకుంటున్నారో ఆమెతో చిన్న భేటీలో చూద్దాం.

ప్ర: అనేగన్‌ చిత్రంతోనే అంతులేకుండా పోయారే?
జ: ఆ తరువాత కుంగ్‌పూ యోగా చిత్రంలో జాకీఛాన్‌తో కలిసి నటిం చే అవకాశం రావడంతో ఆ చిత్రంపైనే దృష్టసారించాల్సిన పరిస్థితి.ఈ చిత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో తెరకెక్కడంతో అందుకు అధిక సమయం అవసరమైంది. దీంతో ఇతర భాషల్లో నటించే అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితి.

ప్ర:  జాకీచాన్‌తో నటించిన అనుభవం?
జ: అదో అద్భుతమైన అనుభూతి. జాకీ సూపర్‌స్టార్‌ అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ? ఎక్కడా ప్రదర్శించరు. చాలా సహజంగా మసలుకునే మనస్తత్వం గల వ్యక్తి. నాకు మంచి ఫ్రెండ్‌ అయ్యారు.

ప్ర: మరి ఓడిఓడి ఉళైక్కనుం చిత్ర హీరో సంతానం గురించి?
జ: సంతానం చాలా జాలీగా ఉండే వ్యక్తి. ఆయన ఇంతకు ముందు నటించిన చిత్రం సూపర్‌హిట్‌ అయ్యింది. ఆయనకు జంటగా నటిం చడం చాలా సంతోషంగా ఉంది.

ప్ర: ఇంతకు ముందు నటుడు ధనుష్‌తో నటించారు. ఆ అనుభవం గురించి?
జ: ధనుష్‌ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారు. అనేగన్‌ చిత్ర షూటింగ్‌ సమయంలో ఆయన చేతిలో వా రానికో పుస్తకం చూసేదాన్ని. ధనుష్‌ చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు గానీ, తనకు అన్ని గ్యాసిప్స్‌ గురించి తెలుసు.ఇక ధనుష్‌ కెమెరా ముందుకు వస్తే కనురెప్ప మూసి తెరసే లోగా పాత్రలో లీనం అయిపోతారు. అదెలా అన్న ఆ ఒక్కటీ నేను ఆయన నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement