Anegan
-
ఆయన నుంచి ఆ ఒక్కటి తెలుసుకోవాలి!
ఆయన నుంచి ఆ ఒక్కటీ తెలుసుకోవాలని ఉంది అంటోంది నటి అమిర. ఆ మధ్య ధనుష్‌కు జంటగా అనేగన్ చిత్రం ద్వారా కోలీవుడ్‌కు దిగుమతి అయి న ఉత్తరాది భామ ఈ జాణ. ఇంతకీ ఈ అమ్మడి గురించి ఇప్పుడెందుకు ప్రస్థావిస్తున్నారనేగా మీ ప్రశ్న?ఈ బ్యూటీ తాజాగా హాస్య కథానాయకుడు సంతానంతో ఓడి ఓడి ఉళైక్కనుమ్ చిత్రంలో రొమాన్స్ చేస్తోంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరిని ఆ ఒక్కటీ అడగాలనుకుంటున్నారో ఆమెతో చిన్న భేటీలో చూద్దాం. ప్ర: అనేగన్ చిత్రంతోనే అంతులేకుండా పోయారే? జ: ఆ తరువాత కుంగ్‌పూ యోగా చిత్రంలో జాకీఛాన్తో కలిసి నటిం చే అవకాశం రావడంతో ఆ చిత్రంపైనే దృష్టసారించాల్సిన పరిస్థితి.ఈ చిత్రం ఆంగ్లం, హిందీ భాషల్లో తెరకెక్కడంతో అందుకు అధిక సమయం అవసరమైంది. దీంతో ఇతర భాషల్లో నటించే అవకాశాలు వచ్చినా ఒప్పుకోలేని పరిస్థితి. ప్ర: జాకీచాన్‌తో నటించిన అనుభవం? జ: అదో అద్భుతమైన అనుభూతి. జాకీ సూపర్‌స్టార్ అయినా ఆ విషయాన్ని ఎప్పుడూ? ఎక్కడా ప్రదర్శించరు. చాలా సహజంగా మసలుకునే మనస్తత్వం గల వ్యక్తి. నాకు మంచి ఫ్రెండ్ అయ్యారు. ప్ర: మరి ఓడిఓడి ఉళైక్కనుం చిత్ర హీరో సంతానం గురించి? జ: సంతానం చాలా జాలీగా ఉండే వ్యక్తి. ఆయన ఇంతకు ముందు నటించిన చిత్రం సూపర్‌హిట్ అయ్యింది. ఆయనకు జంటగా నటిం చడం చాలా సంతోషంగా ఉంది. ప్ర: ఇంతకు ముందు నటుడు ధనుష్‌తో నటించారు. ఆ అనుభవం గురించి? జ: ధనుష్ పుస్తకాలు ఎక్కువగా చదువుతుంటారు. అనేగన్ చిత్ర షూటింగ్ సమయంలో ఆయన చేతిలో వా రానికో పుస్తకం చూసేదాన్ని. ధనుష్ చూడడానికి చాలా ప్రశాంతంగా కనిపిస్తారు గానీ, తనకు అన్ని గ్యాసిప్స్ గురించి తెలుసు.ఇక ధనుష్ కెమెరా ముందుకు వస్తే కనురెప్ప మూసి తెరసే లోగా పాత్రలో లీనం అయిపోతారు. అదెలా అన్న ఆ ఒక్కటీ నేను ఆయన నుంచి తెలుసుకోవాలనుకుంటున్నాను. -
నాలుగు రూపాల్లో కనిపిస్తోన్న ధనుష్
-
మామ తర్వాతే అల్లుడు
మామ చిత్రం తర్వాతే అల్లుడు వస్తాడట. అందుకే అల్లుడి చిత్రం పూర్తి అయినా, మామ చిత్రం కోసం వెయిటింగ్లో పెడుతున్నారట. ఈ మామ అల్లుళ్లు ఎవరంటే, సూపర్‌స్టార్ రజనీకాంత్, ధనుష్. మామ నటిస్తున్న తాజా చిత్రం లింగా, అల్లుడు చిత్రం అనేగన్. ధనుష్ హీరోగా నటిస్తున్న అనేగన్ చిత్రంలో అమిర దస్తర్ హీరోయిన్. కెవి ఆనంద్ దర్శకుడు. ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలు దాదాపు పూర్తయ్యాయి. నవంబర్ 14న విడుదల చేయాలనుకుంటున్నారు. అయితే రజనీకాంత్ నటిస్తున్న లింగా చిత్రాన్ని ఆయన పుట్టిన రోజు సందర్భంగా డిసెంబర్ 12న తెరపైకి తీసుకురానున్నట్టు చిత్ర యూనిట్ ముందే ప్రకటించడంతో ఆ చిత్రం తర్వాతనే ధనుష్ చిత్రాన్ని విడుదల చేయాలని చిత్ర నిర్మాతల వర్గం భావిస్తోందట. లింగా చిత్రంలో రజనీకాంత్ సరసన అనుష్క, సోనాక్షి సిన్హాలు రొమాన్స్ చేస్తున్నారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. దీంతో లింగా చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదలకు నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. మరో విషయం ఏమిటంటే లింగా చిత్రానికి ముందుగా అంటే నవంబర్ చివరిలో విక్రమ్ నటించిన మరో భారీ బ్రహ్మాండ చిత్రం ఐ తెరపైకి రానుంది. ఎమి జాక్సన్ హీరోయిన్గా నటించిన ఈ చిత్రానికి శంకర్ దర్శకుడు. ఆస్కార్ రవిచంద్రన్ నిర్మించిన ఈ చిత్రాన్ని అత్యధిక థియేటర్లలో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో నవంబర్, డిసెంబర్ నెలల్లో మరో పెద్ద చిత్రం విడుదలయ్యే అవకాశం లేదు. ఎందుకంటే ఏ క్లాస్ థియేటర్లన్నీ లింగా, ఐ చిత్రాలే ఆక్రమిస్తాయి. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని అనేగన్ చిత్ర విడుదల తేదీని ప్రకటించనున్నట్లు చిత్ర వర్గాలు వెల్లడించాయి.