ఉత్కంఠను రేకెత్తించే భద్రమ్ | every seen exciting for 'bhadram' movie | Sakshi
Sakshi News home page

ఉత్కంఠను రేకెత్తించే భద్రమ్

Feb 22 2014 11:16 PM | Updated on Sep 2 2017 3:59 AM

ఉత్కంఠను రేకెత్తించే భద్రమ్

ఉత్కంఠను రేకెత్తించే భద్రమ్

అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తేగడి’. ఈ చిత్రం ‘భద్రమ్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది.

అశోక్ సెల్వన్, జనని అయ్యర్ జంటగా రమేష్ దర్శకత్వంలో రూపొందిన తమిళ సినిమా ‘తేగడి’. ఈ చిత్రం ‘భద్రమ్’ పేరుతో తెలుగులో విడుదల కానుంది. బి.రామకృష్ణారెడ్డితో కలిసి శ్రేయాస్ శ్రీను, ఎస్‌కేఎన్ ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. నివాస్ ప్రసన్న స్వరాలందించిన ఈ చిత్రం పాటలను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 
 
 గోిపీచంద్ మలినేని, సుధీర్‌బాబు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని మారుతికి అందించారు. వీరితో పాటు అతిథులుగా విచ్చేసిన సందీప్‌కిషన్, డా.దశరథరామిరెడ్డి, ‘డార్లింగ్’స్వామి, అభిరామ్, రాహుల్, శ్రావ్య, తుమ్మలపల్లి రామసత్యనారాయణ సినిమా విజయం సాధించాలని ఆకాక్షించారు.
 
  తమని నమ్మి ‘తేగడి’ అనువాద హక్కులు అందించిన చిత్ర నిర్మాత సీవీఆనంద్‌కి కృతజ్ఞతలని, ఆద్యంతం ఉత్కంఠగా సాగే థ్రిల్లర్ చిత్రమిదని నిర్మాతలు చెప్పారు. ఈ చిత్రానికి సమర్పణ: బి.సుధారెడ్డి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement