
ప్రతి సన్నివేశం కొత్తగా...
సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రభాకరన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
సస్పెన్స్, థ్రిల్లర్ చిత్రాలకు ఎప్పుడూ ఆదరణ ఉంటుంది. కానీ, సరైన రీతిలో తీస్తేనే. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వినూత్న కథాంశంతో ప్రభాకరన్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఆర్. పద్మజ నిర్మిస్తున్న ఈ చిత్రంలో సోనీ అగర్వాల్, అర్చన, వినోద్‌కుమార్, రవిప్రకాశ్, శివాజీ రాజా, సత్యకృష్ణ ముఖ్య తారలు. ఈ చిత్రవిశేషాలను దర్శక, నిర్మాతలు తెలియజేస్తూ -‘‘కొత్తదనాన్ని కోరుకునే తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రం తప్పకుండా నచ్చుతుంది. ప్రతి సన్నివేశం కొత్తగా ఉంటుంది. సోనీ అగర్వాల్, రవిప్రకాశ్ పాత్రలు ప్రేక్షకులను అలరిస్తే, అర్చన, వినోద్‌కుమార్, శివాజీ రాజా పాత్రలు ఆలోచింపజేస్తాయి. మంచి పాటలకు ఆస్కారం ఉన్న కథ ఇది. తారక రామారావు చక్కని పాటలు స్వరపరిచారు. ప్రస్తుతం చివరి షెడ్యూల్ జరుపుతున్నాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: పార్వతి చంద్, ఎడిటింగ్: రమేశ్, సమర్పణ: ఉదయభాస్కర్ జాస్తి.