ప్రభాస్‌పై బాలీవుడ్‌ నటి కామెంట్స్‌

 Evelyn Sharma Reveals Prabhass Working Style On Saaho Sets - Sakshi

సాక్షి, ముంబై : సాహోలో నటిస్తున్న బాలీవుడ్‌ నటి ఎవలిన్‌ శర్మ ప్రభాస్‌ సెట్స్‌పై ఎలా ఉంటారో వెల్లడించింది. సుజీత్‌ దర్శకత్వంలో ప్రభాస్‌, శ్రద్ధా కపూర్‌లు జంటగా స్పై థ్రిల్లర్‌గా రూపొందుతున్న సాహోలో ఎవలిన్‌ శర్మ యాక్షన్‌ దృశ్యాల్లో అలరించనుంది. ఈ మూవీలో ఒళ్లు గగుర్పొడిచే రీతిలో పోరాట దృశ్యాలను తెరకెక్కిస్తున్నారని, ఈ తరహా చిత్రాలు తనకు ఎంతో ఇష్టమని ఎవలిన్‌ చెబుతున్నారు. ఇక సెట్స్‌లో హీరో ప్రభాస్‌ తీరును ఆమె మెచ్చుకున్నారు. ప్రభాస్‌ అందరితో మర్యాదపూర్వకంగా మెలిగే సూపర్‌స్టార్‌ అని, ఒక్కసారి పరిచయమైతే అతనిలో బిడియం మాయమవుతుందని, చుట్టూ ఉన్న వారందరినీ నవ్విస్తుంటాడని చెప్పారు.

ప్రభాస్‌తో, సాహో టీంతో పనిచేయడం తనకు ఎంతో ఆనందం కలిగిస్తోందని మురిసిపోయారు. పూర్తిస్థాయి యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కుతున్న సాహోలో కొన్ని గన్‌షాట్‌ సీక్వెన్స్‌లున్నాయని, అవెంజర్స్‌కు పనిచేసిన బృందంతోనే స్టంట్స్‌ రూపొందుతున్నాయంటే అవి ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చని సినిమాపై అం‍చనాలు మరింత పెంచేశారు.

తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో రూపొందుతున్న సాహో 2019లో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top