ఆహా.. ఓహో... సాహో

Evelyn Sharma joins Prabhas and Shraddha Kapoor in 'Saaho' - Sakshi

...లో భలే చాన్స్‌ అంటూ టీమ్‌కి మరో బాలీవుడ్‌ బ్యూటీ ఎవెలిన్‌ శర్మ హాయ్‌ చెప్పారు. ‘ఏ జవానీ హై దివానీ, జబ్‌ హ్యారీ మెట్‌ సెజల్‌’ చిత్రాలతో పాటు మరికొన్ని హిందీ సినిమాల్లో నటించారు ఎవెలిన్‌. ఆల్రెడీ బీటౌన్‌ నుంచి శ్రద్ధా కపూర్‌ ‘సాహో’ లో హీరోయిన్‌గా చేస్తున్నారు. మరి.. ఎవెలిన్‌ సెకండ్‌ హీరోయినా? అంటే ఆ విషయం మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్‌. ఈ సినిమాలో తన క్యారెక్టర్‌ కోసం ఎవెలిన్‌ ఆల్రెడీ పది కిలోలు బరువు కూడా తగ్గారు. అంతేకాదు ప్రేక్షకులు అబ్బురపోయేలా సినిమాలో కీలకమైన యాక్షన్‌ స్టంట్స్‌ చేయబోతున్నారట ఎవెలిన్‌.

ప్రభాస్‌ హీరోగా సుజీత్‌ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నిర్మిస్తున్న చిత్రం ‘సాహో’. ఇందులో నీల్‌నితిన్‌ ముఖేష్, అరుణ్‌ విజయ్‌ కీలక పాత్రలు చేస్తున్నారు. హిందీ వెర్షన్‌ను టీ–సిరీస్‌ అధినేత భూషణ్‌కుమార్‌ రిలీజ్‌ చేయనున్నారు. అబుదాబి షెడ్యూల్‌లో ‘సాహో’ టీమ్‌తో ప్రభాస్‌ ఈ నెల 21న జాయిన్‌ అవ్వనున్నారు. ‘‘మాటలు రావడం లేదు. హ్యాపీగా ఉంది. నా లైఫ్‌లో మోస్ట్‌ హ్యాపీ పార్ట్‌ ఇది. యాక్షన్‌ రోల్‌ చేయాలనుకుంటున్న టైమ్‌లో మెగా ఫిల్మ్‌ ‘సాహో’లో చాన్స్‌ దొరికింది. టీమ్‌తో జాయిన్‌ అవ్వడానికి ఎగై్జటింగ్‌గా ఎదురు చూస్తున్నా. ‘సాహో’ టీమ్‌లో నన్ను మెంబర్‌ని చేసినందుకు సుజీత్, ప్రభాస్‌ అండ్‌ టీమ్‌కి «థ్యాంక్స్‌’’ అన్నారు ఎవెలిన్‌ శర్మ. ‘సాహో’ చిత్రం వచ్చే ఏడాది రిలీజ్‌ కానుంది.

‘సాహో’ కొబ్బరికాయ కథ ఇది!
అన్నా.. అప్‌డేట్‌ చెప్పు? దుబాయ్‌ షెడ్యూల్‌ ఎప్పుడు? ఇదిగో ఇలాగే ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ‘సాహో’ డైరెక్టర్‌ సుజీత్‌కు ప్రశ్నల మీద ప్రశ్నలు వేశారు. ‘‘బాస్‌.. దుబాయ్‌లో  ‘సాహో’ షెడ్యూల్‌ స్టార్ట్‌ అయినప్పుడు కొబ్బరికాయ కొట్టే  ఫొటో పెడతాను’’ అని కొన్ని రోజుల క్రితం చెప్పారు సుజీత్‌. అన్నట్లుగానే ‘సాహో’ షెడ్యూల్‌ శనివారం స్టార్ట్‌ కాబోతోందని కొబ్బరికాయ ఫొటోను ట్వీటర్‌లో పెట్టి, అప్‌డేట్‌ ఇచ్చారు సుజీత్‌.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top