ఇంజినీరింగ్‌ నేపథ్యంలో... | Eureka Movie Teaser Released | Sakshi
Sakshi News home page

ఇంజినీరింగ్‌ నేపథ్యంలో...

May 13 2019 3:25 AM | Updated on May 13 2019 3:25 AM

Eureka Movie Teaser Released - Sakshi

యురేక పోస్టర్‌

కార్తీక్‌ ఆనంద్, షాలినీ, మున్నా, డింపుల్‌ హయతి ప్రధాన పాత్రల్లో కార్తీక్‌ ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యురేక’. లక్ష్మి ప్రసాద్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై ప్రశాంత్‌ తాత నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఈ సందర్భంగా టీజర్‌ని విడుదల చేశారు. కార్తీక్‌ ఆనంద్‌ మాట్లాడుతూ– ‘‘ఇంజినీరింగ్‌ కాలేజ్‌ నేపథ్యంలో తెరకెక్కిన లవ్‌ యాక్షన్‌ ఎంటర్‌ టైనర్‌ సినిమా ఇది.

ఔట్‌పుట్‌ చాలా బాగా వచ్చింది.  టీజర్‌ విడుదలైన కొద్ది సేపటికే మంచి స్పందన వచ్చింది’’ అన్నారు. ‘‘త్వరలోనే మా చిత్రాన్ని ట్రైలర్‌ని రిలీజ్‌ చేసి, సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని ప్రశాంత్‌ తాత అన్నారు. అపూర్వ, బ్రహ్మాజీ, రఘుబాబు, శివన్నారాయణ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: లలిత కుమారి బొడ్డుచర్ల, సంగీతం: నరేష్‌ కుమరన్, కెమెరా: ఎన్‌.బి. విశ్వకాంత్, లైన్‌ ప్రొడ్యూసర్‌: బి.ఆర్‌.ఎస్‌.టి.సాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement