మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్నా.. కానీ అత‌ను! | Erica Fernandez Reveals She Is In Love | Sakshi
Sakshi News home page

మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాను.. కానీ అత‌ను!

Jun 29 2020 1:34 PM | Updated on Jun 29 2020 2:24 PM

Ernika Fernandez Reveals She Is In Love - Sakshi

ముంబై : గత మూడేళ్లుగా తాను ప్రేమలో ఉన్నానని బాలీవుడ్‌ బుల్లితెర నటి ఎరికా ఫెర్నాండెజ్‌ తెలిపారు. అయితే తన ప్రియుడు చిత్ర పరిశ్రమకు చెందినవాడు కాదని ఆమె స్పష్టం చేశారు. 'కసౌతి జిందగీ కే 2’ సీరియ‌ల్‌లో ప్రేర్నా‌గా నటించిన టీవీ స్టార్ ఎరికా ఫెర్నాండెజ్ త‌న‌ సహనటుడు పార్థ్‌ సమతాన్‌తో, ఇంత‌క‌ముందు ఎరికా ‘కుచ్‌ రంగ్‌ ప్యార్‌ కే ఐసే భీ’ సహనటుడు షాకీర్‌ షేక్‌తో రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి. అయితే పార్థ్, షాకీర్ ఇద్ద‌రూ స్నేహితులు మాత్ర‌మేన‌ని ఎరికా క్లారిటీ ఇచ్చారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్‌ లైవ్‌లో మాట్లాడిన ఎరికా ఫెర్నాండెజ్‌..‌ తాను మూడేళ్లుగా ఒకరితో ప్రేమాయాణం కొనసాగిస్తున్నట్లు తెలిపారు. అంతేగాక అతను సినీ పరిశ్రమకు చెందిన వాడు కానందున అతన్ని ఎవరూ తెలుసుకోలేరని అన్నారు. (గ‌త మూడేళ్లుగా ప్రేమ‌లో ఉన్నాను.. కానీ)

'నా భాయ్‌ఫ్రెండ్ నా షోలు చూస్తుంటాడు. అత‌నికి నేను వేరే వాళ్ల‌తో రొమాన్స్ చేయ‌డం న‌చ్చ‌దు. కానీ మా మ‌ధ్య ఉన్న స్నేహం, అవ‌గాహ‌న వ‌ల్ల ఇంకా రిలేష‌న్‌లో కొన‌సాగుతున్నాం. అయితే ఇటీవ‌ల నా కోస్టార్స్‌తో సంబంధం ఉన్న‌ట్లు పుకార్లు వ‌స్తున్న నేప‌థ్యంలో మా రిలేషన్షిప్ గురించి చెప్పాల‌నుకున్నాను. అందుకే ఇప్పుడు మాట్లాడుతున్నాను. అని ఎరికా తెలిపారు. ఇక ఎరికా ఆది సాయికుమార్‌ నటించిన గాలిపటం వంటి తెలుగు సినిమాల్లోనూ కనిపించారు. (ఈ బుడ్డోడి డ్యాన్స్‌కు రచయిత ఫిదా)

Advertisement
 
Advertisement
Advertisement