‘ఎంత అందంగా ఉన్నావె’
‘‘అపార్ట్‌మెంట్ అన్నాక రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. అందరూ అందరితో కలవాలనే నిబంధనలేవీ లేవు. కొందరు పాలూ నీళ్లలా కలిసిపోతారు.
‘‘అపార్ట్‌మెంట్ అన్నాక రకరకాల మనస్తత్వాలు కలిగిన మనుషులు ఉంటారు. అందరూ అందరితో కలవాలనే నిబంధనలేవీ లేవు. కొందరు పాలూ నీళ్లలా కలిసిపోతారు. మరికొందరు ఉప్పు నిప్పులా ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటారు. అలాంటి రెండు కుటుంబాలకు చెందిన అమ్మాయి, అబ్బాయి ప్రేమలో పడితే ఎలా ఉంటుందనే నేపథ్యంలో ఈ సినిమా తీశాం.
కచ్చితంగా అందర్నీ ఆకట్టుకునే ప్రేమకథ ఇది’’ అని నిర్మాత గంగపట్నం శ్రీధర్ చెప్పారు. ‘నువ్విలా’ ఫేమ్ అజయ్ మంతెన, జియానా జంటగా ఎస్.ఐ. మహేంద్ర దర్శకత్వంలో రూపొందిన ‘ఎంత అందంగా ఉన్నావె’ ఈ వారంలో విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ -‘‘ఫ్లాట్స్ నేపథ్యంలో అందర్నీ ఫ్లాట్ చేసే కథ ఇది.
యోగీశ్వరశర్మ సంగీతం ఈ సినిమాకు మెయిన్ ఎస్సెట్. సీతారామశాస్త్రి సాహిత్యం గురించి మేం ప్రత్యేకంగా చెప్పేదేముంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా, వినోదాత్మకంగా, ప్రణయాత్మకంగా ఈ సినిమా ఉంటుంది’’ అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా: బాలరెడ్డి, సహనిర్మాతలు: అశోక్ సోని, మహ్మద్ రఫీ, సమర్పణ: తమ్మిరెడ్డి చంద్రశేఖర్‌రెడ్డి.