మహానుభావుల వినోదం | 'Endaro Mahanubhavulu' audio launched | Sakshi
Sakshi News home page

మహానుభావుల వినోదం

Dec 18 2016 11:45 PM | Updated on Sep 4 2017 11:03 PM

మహానుభావుల వినోదం

మహానుభావుల వినోదం

సాయికృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘ఎందరో మహానుభావులు’.

సాయికృష్ణ హీరోగా నటిస్తూ, దర్శకత్వం వహించిన సినిమా ‘ఎందరో మహానుభావులు’. పల్లాడ శ్రీనివాస్, శ్రీలక్ష్మి నిర్మాతలు. సిద్ధార్థ్‌ స్వరపరిచిన పాటల సీడీలను సంగీత దర్శకుడు రఘు కుంచె విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘చిత్ర పరిశ్రమతో మాకు పరిచయం లేదు. కానీ, సినిమాలంటే మా అబ్బాయికి పిచ్చి. తన ఆశ నెరవేర్చడం కోసం ఈ సినిమా నిర్మించాం. తను తీసిన ‘ఫ్రెండ్లీ పోలీస్‌’ షార్ట్‌ ఫిల్మ్‌ చూసి సీయం కేసీఆర్‌ అభినందించారు’’ అన్నారు. ‘‘టైటిల్‌కు భిన్నంగా ఉండే పూర్తి వినోదాత్మక చిత్రమిది’’ అన్నారు సాయికృష్ణ. హీరోయిన్‌ అనీషా, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత సాయికుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement