ఇంగ వాంగ | Eesha Rebba pairs up with GV Prakash in his next | Sakshi
Sakshi News home page

ఇంగ వాంగ

Apr 4 2019 4:03 AM | Updated on Apr 4 2019 4:03 AM

Eesha Rebba pairs up with GV Prakash in his next - Sakshi

ఈషా రెబ్బా

తెలుగు అమ్మాయి ఈషా రెబ్బా మళ్లీ తమిళ డైలాగ్స్‌ను ప్రాక్టీస్‌ చేస్తున్నారు. అవును.. ఆమెకు కోలీవుడ్‌ నుంచి మళ్లీ ‘ఈషా.. ఇంగ వాంగ’ అని కబురు వచ్చింది. అంటే.. ఈషా.. ఇక్కడికి రండి అని అర్థం. ‘వైలేయున్ను వందుట్టా వెళ్లక్కారన్, సరవణన్‌ ఇరుక్క భయమేన్‌’ వంటి తమిళ సినిమాలకు దర్శకత్వం వహించిన ఏళిల్‌ దర్శకత్వంలో నటుడు, సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌కుమార్‌ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో కథానాయికగా ఈషా రెబ్బాను తీసుకున్నారు. హారర్, కామెడీ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇంతకుముందు ‘ఓయ్‌’ (2016) అనే తమిళ సినిమాలో నటించారు ఈషా రెబ్బా.

Advertisement
 
Advertisement
Advertisement