వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? | Ed Sheeran dating Barbara Palvin? | Sakshi
Sakshi News home page

వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా?

Mar 30 2015 8:55 AM | Updated on Sep 27 2018 5:09 PM

వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా? - Sakshi

వాళ్లిద్దరూ డేటింగ్ లో ఉన్నారా?

కొన్ని రోజుల క్రితం ఎథినా ఆండ్రొలోస్తో బ్రేకప్ చెప్పిన పాప్ సింగర్ ఎడ్ షీరన్ తాజాగా మోడల్ బార్బరాతో డేటింగ్ చేస్తున్నాడా?

సిడ్నీ: కొన్ని రోజుల క్రితం ఎథినా ఆండ్రొలోస్తో బ్రేకప్ చెప్పిన పాప్ సింగర్ ఎడ్ షీరన్ తాజాగా మోడల్ బార్బరాతో డేటింగ్ చేస్తున్నాడా? అంటే అవుననే అంటున్నాయి హాలీవుడ్ వర్గాలు. సిడ్నీలోని మేరీ స్ట్రీట్ లోని బర్జర్బార్ లో వీరిరువురూ కలిసి తీయించుకున్న కొన్ని ఫొటోగ్రాఫ్ లను పరిశీలిస్తే ఇది నిజమేననిపిస్తోంది.  ఆ సమయంలో ఎడ్ షీరన్ తెలుపురంగు టీషర్ట్, డెనిమ్ జీన్స్ ధరించిఉన్నారు. టీషర్ట్ పై "గివ్ మీ లవ్" అని రాసుంది. అయితే బార్బరా తనను ఎవరూ గుర్తుపట్టకుండా నలుపురంగు టీషర్ట్, బూడిదరంగు జీన్స్, నలుపురంగు బూట్లు ధరించింది. కారులో కూర్చున్న సమయంలో పాల్విన్ తన చేతిని ముఖానికి అడ్డుగా పెట్టుకుంది. ప్రస్తుతం షీరన్ తన కొత్త ఆల్బమ్ "ఎక్స్" ప్రమోషన్ కోసం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు.  


 

Advertisement
 
Advertisement
Advertisement