డిఫరెంట్ డైనమైట్ | 'Dynamite' is Vishnu Manchu's Remake of Deva Katta's Movie 'Arima Nambi' | Sakshi
Sakshi News home page

డిఫరెంట్ డైనమైట్

Mar 1 2015 10:50 PM | Updated on Sep 2 2017 10:08 PM

డిఫరెంట్ డైనమైట్

డిఫరెంట్ డైనమైట్

చెవి పోగు,90 చేతి పొడవునా టాటూ, కొత్త హెయిర్ స్టయిల్.. ఇలా తాజా చిత్రంలో మంచు విష్ణు సరికొత్తగా కనిపించనున్నారు.

చెవి పోగు,90 చేతి పొడవునా టాటూ, కొత్త హెయిర్ స్టయిల్.. ఇలా తాజా చిత్రంలో మంచు విష్ణు సరికొత్తగా కనిపించనున్నారు. దేవా కట్టా దర్శకత్వంలో 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై ఆయన హీరోగా నటిస్తూ, ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ‘డైనమైట్’ అనే టైటిల్ ఖరారు చేశారు. వైవిధ్యభరితమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రంలో డిఫరెంట్ లుక్‌తో కనిపించనున్నానని విష్ణు చెబుతూ - ‘‘నా పాత్ర లుక్, కథానుగుణంగా ‘డైనమైట్’ అయితే బాగుంటుందని దాన్నే ఖరారు చేశాం. ఈ సినిమాలో రిస్కీ ఫైట్స్ ఉన్నాయి. దానికోసం ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాను. ప్రస్తుతం షూటింగ్ తుది దశలో ఉంది. అన్ని వర్గాలవారినీ అలరించే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని దేవా కట్టా తెరకెక్కిస్తున్నారు. ఈ వేసవికి చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని తెలిపారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement