దుల్కర్‌ నిర్మాతయ్యాడోచ్‌ | Dulquer Salmaan turns on producer | Sakshi
Sakshi News home page

దుల్కర్‌ నిర్మాతయ్యాడోచ్‌

May 12 2019 1:50 AM | Updated on May 12 2019 1:50 AM

Dulquer Salmaan turns on producer - Sakshi

దుల్కర్‌ సల్మాన్‌

ఈ మధ్య స్టార్స్‌ కేవలం స్క్రీన్‌ మీదే కాదు.. ఆఫ్‌ స్క్రీన్‌ కూడా సరికొత్త రోల్స్‌ టేకప్‌ చేస్తున్నారు. మలయాళ నటుడు దుల్కర్‌ సల్మాన్‌ కూడా కొత్త చాలెంజింగ్‌ రోల్‌కి మారారు. ప్రొడ్యూసర్‌గా సరికొత్త అవతారం ఎత్తారు. ‘మహానటి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని గెలుచుకున్న దుల్కర్‌ సల్మాన్‌ ప్రస్తుతం మలయాళం, హిందీ, తమిళ సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. ఈ బిజీలోనూ ప్రొడ్యూసర్‌ బాబుగా ఓ మలయాళ సినిమాను స్టార్ట్‌ చేశారు. సన్నీవాన్‌ హీరోగా నటిస్తున్నారు. ‘‘నా ప్రొడక్షన్‌లో మొదటి సినిమా షూటింగ్‌ ఈరోజే మొదలైంది. సినిమా పేరు, నా బ్యానర్‌ పేరు త్వరలోనే అనౌన్స్‌ చేస్తాం. క్వాలిటీ సినిమాలు తీయాలనే మీ ఆశీర్వాదాలు మాకు కావాలి’’ అని దుల్కర్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement