దట్టమైన పొగతో నిలిచిన ‘దోస్తానా 2’ షూటింగ్

న్యూఢిల్లీ: తీవ్రమైన కాలుష్యంతో ఢిల్లీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వాయు కాలుష్యాన్ని తగ్గించాలని, ఆ పొగలో తాము నివసించలేకపోతున్నామని నగర ప్రజలు మొత్తుకుంటున్నారు. ఇక కాలుష్యం కష్టాలు సినిమా వాళ్లను కూడా ఇబ్బందుల్లోకి నెట్టాయి. కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘దోస్తానా 2’. షూటింగ్ షెడ్యూల్‌లో భాగంగా ఢిల్లీలో కొన్ని సన్నివేశాలను చిత్రీకరణ జరుపుకోవాల్సి ఉంది.
అయితే ప్రస్తుతం దేశ రాజధానిలో ఆవరించి ఉన్న తెల్లటి దట్టమైన పొగతో ఎదుటివాళ్లు సైతం సరిగా కనిపించలేని పరిస్థితి నెలకొంది. దీంతో సినిమా చిత్రీకరణ కష్టమని భావించిన యూనిట్.. షూటింగ్ రద్దు చేసుకుంది. కనీసం ఊపిరి తీసుకోవడం కూడా ఇబ్బందిగా ఉండటంతో వాతావరణం తిరిగి సాధారణ స్థితికి వచ్చేవరకు షూటింగ్‌ను నిలిపివేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. కాగా 2008లో ప్రియాంక చోప్రా, జాన్ అబ్రహం, అభిషేక్ బచ్చన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘దోస్తానా’ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ చిత్రానికి ‘దోస్తానా 2’ సీక్వెల్‌గా రానుంది.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి