అది మాత్రం అడగొద్దు | dont ask about shimbu love : hansika | Sakshi
Sakshi News home page

అది మాత్రం అడగొద్దు

Feb 20 2014 11:38 PM | Updated on Sep 2 2017 3:55 AM

అది మాత్రం అడగొద్దు

అది మాత్రం అడగొద్దు

శింబుతో ప్రేమ ప్రస్తావన రాగానే ప్లీజ్ అది మాత్రం అడగొద్దు అంటోంది నటి హన్సిక. ఈ అందాల భామపై ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. హన్సిక మాట్లాడుతూ తాను ఈ ఏడాది చాలా బిజీగా ఉన్నానంది.

 శింబుతో ప్రేమ ప్రస్తావన రాగానే ప్లీజ్ అది మాత్రం అడగొద్దు అంటోంది నటి హన్సిక. ఈ అందాల భామపై ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయన్న విషయం తెలిసిందే. హన్సిక మాట్లాడుతూ తాను ఈ ఏడాది చాలా బిజీగా ఉన్నానంది. 22 ఏళ్లలోనే ఇంత బిజీగా ఉండటం గొప్పగా భావిస్తున్నాననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మరి కొందరు పదేళ్ల వరకు మీరు సినిమాలో నిలబడతారా? అని అడుగుతున్నారని అంది. తనకు అలాంటి విషయాలపై చింత లేదని చెప్పింది. తాను గడుస్తున్న రోజులను లెక్క పెడుతూ కూర్చోనని పేర్కొంది. తమన్న, సమంతలతో పోటీ ఎలా ఉందని అడుగుతున్నారని నిజానికి తనకలాంటి భావనే లేదని స్పష్టం చేసింది.  ఇప్పుడు కూడా తన చేతిలో పది చిత్రాలు ఉన్నాయని చెప్పింది. ప్రతి పాత్రలోనూ బాగా నటించాలని ఆశిస్తున్నానంది. ఎవరి నటన అయినా నచ్చితే వెంటనే ఫోన్ చేసి వారిని అభినందిస్తానని తెలిపింది. ఇకపోతే శింబుతో ప్రేమ కొండెక్కిందటగా అని అడుగుతున్నారని ఇలాంటి వాటికి దూరంగా ఉండాలనుకుంటున్నానని కాబట్టి మరోసారి ఈ ప్రశ్న అడగొద్దని అంది. ఎదుటపడిన వారంతా పెళ్లెప్పుడని అడుగుతున్నారంది.
 
  తనకు నచ్చని విషయాలకు బదులు చెప్పడం ఇష్టం లేదని పేర్కొంది. సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు వివరంగా చెబుతానని అంది. 15 ఏళ్ల వయసులోనే తాను నటి నవుతానని ఊహించలేదని, అదే విధంగా సమయం వచ్చినప్పుడు తనకు, తన తల్లికి కరెక్ట్ అనిపించినప్పుడు పెళ్లి చేసుకుంటానని హన్సిక స్పష్టం చేసింది.
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement