పత్తు సుందరిగళ్! | Doesn't Tabu's saree squad look incredible? | Sakshi
Sakshi News home page

పత్తు సుందరిగళ్!

Sep 7 2016 11:55 PM | Updated on Sep 4 2017 12:33 PM

పత్తు సుందరిగళ్!

పత్తు సుందరిగళ్!

ఇక్కడున్న ఫొటోని చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదు కదూ! కేరళ సంప్రదాయ చీరలో తారలందరూ తళుక్కుమంటే చూసే కొద్దీ చూడబుద్ధవుతోంది

ఇక్కడున్న ఫొటోని చూడ్డానికి రెండు కళ్లూ చాలడంలేదు కదూ! కేరళ సంప్రదాయ చీరలో తారలందరూ తళుక్కుమంటే చూసే కొద్దీ చూడబుద్ధవుతోంది కదూ! ఫొటోలో మన తెలుగింటి కోడలు అమల, హైదరాబాదీ భామ టబు, తమిళింటి ఆడపడుచులు రాధిక, శ్రీప్రియ... ఇలా అందరూ కేరళ స్టైల్ చీర కట్టుకుని ఎక్కడ మెరిసినట్లు? ఆ విషయానికే వస్తున్నాం.
 
  ఇటీవల రాధిక కుమార్తె రేయాన్ వివాహం జరిగిన విషయం తెలిసిందే. చెన్నైలో జరిగిన ఆ వేడుకకు దక్షిణ, ఉత్తరాది చిత్రసీమ నుంచి పలువురు ప్రముఖ తారలు హాజరయ్యారు. ఈ వేడుకకు హాజరైనవాళ్లలో కొంతమంది కేరళలో జరిగిన లక్ష్మి తనయుడు వరుణ్ పెళ్లికి వెళ్లారు. ఒకప్పటి ప్రముఖ తారలు, తమిళ, మలయాళ పరిశ్రమల్లో ట్రివాంకూర్ సిస్టర్స్‌గా పేరు, ప్రతిష్ఠలు సాధించిన పద్మిణి-రాగిణి-లలితల మనవడే వరుణ్.
 
  రాగిణి కూతురు లక్ష్మి. కేరళలోని ట్రివాంకూరులో జరిగిన వరుణ్ పెళ్లికి వెళ్లిన వాళ్లల్లో రాధిక, శ్రీప్రియ, లిజి, అమల, టబు, జ్యోతిక తదితరులు ఉన్నారు. పెళ్లి కేరళలో కాబట్టి, అక్కడి సంప్రదాయానుసారంగా చీర కట్టుకుని, నగలు పెట్టుకుని.. ఇలా ఫొటో దిగారు. ఈ ‘పత్తు సుందరిగళ్’ అంటే.. పదిమంది సుందరీమణులు వివాహ వేడుకకు నిండుదనం తెచ్చి ఉంటారని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement