‘వాల్మీకి’లో సుకుమార్‌!

Director Sukumar May Act In Valmiki Movie - Sakshi

ఈ ఏడాది ఎఫ్‌2తో బ్లాక్‌ బస్టర్‌హిట్‌ కొట్టిన వరుణ్‌ తేజ్‌.. త్వరలోనే ఓ రీమేక్‌ మూవీతో పలకరించనున్నాడు. తమిళ హిట్‌ మూవీ జిగర్తాండను తెలుగులో వాల్మీకిగా తెరకెక్కిస్తున్నారు. రీమేక్‌ స్పెషలిస్ట్‌ హరీష్‌ శంకర్‌.. ఈ మూవీని రీమేక్‌ చేస్తుండటంతో అంచనాలు పెరిగాయి. ఇప్పటికే రిలీజ్‌ చేసిన టీజర్‌, పోస్టర్స్‌, సాంగ్‌.. సినిమాపై హైప్‌ను క్రియేట్‌ చేశాయి.

తాజాగా ఈ మూవీలో సుకుమార్‌ స్పెషల్‌ రోల్‌లో నటించనున్నట్లు తెలుస్తోంది. కథానుగుణంగా.. ఈ మూవీలో వరుణ్‌ తేజ్‌పై ఓ సినిమాను తెరకెక్కించే పనిలో అథర్వా ఉంటాడు. సినీ ఇండస్ట్రీకి సంబంధించి తెరకెక్కించే సన్నివేశాల్లో సుకుమార్‌ ప్రత్యేక పాత్రలో నటించనున్నట్లు ఓ క్లూను వదిలాడు దర్శకుడు హరీష్‌ శంకర్‌. ఈ మేరకు సుకుమార్‌తో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేస్తూ.. వాల్మీకిలో సుకుమార్‌ నుంచి చిన్న సర్‌ప్రైజ్‌ అంటూ ట్వీట్‌ చేశారు. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను సెప్టెంబర్‌ 20న విడుదల చేయనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top