నా దృష్టంతా ఆ సినిమా పైనే.. డైరెక్టర్‌ క్లారిటీ

Director Sudha Kongara Gives Clarity On Vijay Movie - Sakshi

తీసింది రెండు చిత్రాలే అయినప్పటికీ విభిన్న చిత్రాల దర్శకురాలిగా పేరు తెచ్చుకున్నారు సుధ కొంగర. మణిరత్నం దగ్గర సహాయ దర్శకురాలిగా పనిచేశారు. ఇప్పటికే ‘ద్రోహి’, ‘గురు’ వంటి భారీ విజయాలను అందుకున్నారు. ప్రస్తుతం సూర్య హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశం నీ హద్దురా’ చిత్రంతో సుధ బిజీగా ఉన్నారు. విడుదలకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం తర్వాత తమిళ స్టార్‌ హీరో విజయ్‌తో ఓ సినిమా చేయనున్నట్లు అనేక వార్తల వస్తున్నాయి. 

అయితే ఈ వార్తలపై తాజాగా సుధ స్పందించారు. ప్రస్తుతం తన దృష్టంతా ‘ఆకాశం నీ హద్దురా’పైనే ఉందని, మరో సినిమాపై లేదని తేల్చిచెప్పారు. ఇప్పటివరకు ఏ హీరోకు కథ వినిపించలేదని, మరే సినిమాకు కమిట్‌ కాలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ లాక్‌డౌన్‌ సమయంలో అందరూ ఇంట్లోనే ఉండాలని, క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలని సూచించారు. ఇక ప్రస్తుతం విజయ్‌ లోకేష్‌ కనకరాజు దర్శకత్వంలో ‘మాస్టర్‌’ తీస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తర్వాత విజయ్‌ను సుధ డైరెక్ట్‌ చేయబోతున్నారని వార్తలు రాగా తాజాగా ఆ వార్తలను ఆమె కొట్టిపారేశారు. దాదాపు షూటింగ్‌ పూర్తి చేసుకున్న ‘ఆకాశం నీ హద్దురా’ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్ర పోషించారు.   

చదవండి:
పవర్‌ స్టార్‌ సరసన అనుష్క?
‘ఆచార్య’లో అనసూయ.. చరణ్‌తో?

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top