అభిమానులకు పండగే

Director Siva and Suriya to team up for Studio Green next film - Sakshi

అభిమాన హీరో సినిమా రిలీజ్‌ అవ్వడమే అభిమానులకు పండగ. ఆ పండక్కే పండగ లాంటి సినిమా ఇవ్వాలనుకుంటారు దర్శక, నిర్మాతలు. సూర్య అభిమానులకు ఇలాంటి పండగనే అందించడానికి సిద్ధమయ్యాం అంటున్నారు స్టూడియోగ్రీన్‌ బ్యానర్‌ అధినేత జ్ఞానవేల్‌రాజా. సూర్య హీరోగా దర్శకుడు శివ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు.

ఈ సినిమాను స్టూడియోగ్రీన్‌ నిర్మిస్తోంది. సూర్య 39వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘ఈ కాంబినేషన్‌ మీద ఆకాశాన్ని అంటే అంచనాలున్నాయి. సూర్య అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా పండగే’’ అని నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్‌ పేర్కొంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘శూరరై పోట్రు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శివ–సూర్యల సినిమా సెట్స్‌ మీదకు వెళ్లనుంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top