మారుతి రిలీజ్‌ చేసిన ‘వాట్‌ ఎ అమ్మాయి’

Director Maruthi Released What A Ammai Short Film - Sakshi

షార్ట్‌ ఫిలిం నేపథ్యం నుంచి వచ్చిన యువ దర్శకులు ప్రస్తుతం వెండితెర మీద సత్తా చాటుతున్నారు. తరుణ్‌ భాస్కర్‌ , వెంకీ అట్లూరి, విరించి వర్మ, శ్రీరామ్‌ ఆదిత్య, కార్తీక్‌ ఘట్టమనేని ఇలా షార్ట్‌ ఫిలింస్‌తో సత్తా చాటిన చాలా మంది వెండితెర మీద కూడా ఆకట్టుకున్నారు. అందుకే లఘు చిత్ర దర్శకులకు ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి కూడా మంచి సపోర్ట్ లభిస్తుంది.

తాజాగా దర్శకుడు మారుతి ఓ షార్ట్‌ ఫిలింను రిలీజ్‌ చేశారు. వాట్ ఏ అమ్మాయి పేరుతో తెరకెక్కిన ఈ షార్ట్‌ ఫిలింకు ఏలూరు శ్రీను దర్శకుడు. సూర్య భరత్‌ చంద్ర, పావని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ లఘు చిత్రానికి నరేష్‌ సంగీతమందిచారు. మనీష్‌ పట్టిపాటి నిర్మాత. తన సోషల్‌ మీడియా ద్వారా ‘వాట్‌ ఎ అమ్మాయి’ షార్ట్ ఫిలిం రిలీజ్ చేసిన మారుతి యూనిట్‌కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top