మణిరత్నంకు గుండెపోటు వార్తలపై అపోలో ప్రకటన

Director Manirathnam Suffered From Heart Attack - Sakshi

సాక్షి, చెన్నై: ప్రఖ్యాత దర్శకుడు, దక్షిణాది సినీ దిగ్గజం మణిరత్నం (62)కు గుండెపోటు వచ్చిందనే వార్తలపై అపోలో వైద్యులు స్పందిచారు. ఆయనకు గుండెపోటు రాలేదని వారు తెలిపారు. కేవలం రెగ్యూలర్‌ చెకప్‌ కోసమే ఆయన ఆస్పత్రికి వచ్చినట్టు వెల్లడించారు. కాగా, గురువారం మ‌ధ్యాహ్నం ఆయనకు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో ఆయ‌న‌ను వెంట‌నే చెన్నైలోని అపోలో ఆస్పత్రికి తరలించినట్టు ప్రచారం జరిగింది. దీంతో సినీ ప్రముఖులు, ఆయన అభిమానులు ఆందోళన చెందారు.  

భారతీయ చిత్రసీమ గర్వించదగ్గ అనేక కళాత్మక చిత్రాలను మణిరత్నం తెరకెక్కించారు. నాయకుడు, దళపతి, రోజా, ముంబై, సఖి, ఓకే బంగారం, ఇద్ద‌రు వంటి ప్రఖ్యాత‌ సినిమాలను మణిరత్నం రూపొందించారు. త్వరలో రానున్న చెక్క చివంత వనం మూవీ పోస్టు ప్రొడక్షన్ పనుల్లో మణిరత్నం ప్ర‌స్తుతం బిజీగా ఉన్నారు. ఈ సినిమా తెలుగులో నవాబ్ పేరుతో రానుంది. రోజా, దళపతి, నాయకుడు, ఓకే బంగారం, బొంబాయి, గురు లాంటి ఎన్నో సూపర్‌హిట్ సినిమాలను అటు కొలీవుడ్, ఇటు టాలీవుడ్ ప్రేక్షకులకు అందించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top