నంది వివాదం: దర్శకుడు మద్దినేని సంచలన వ్యాఖ్యలు

Director maddineni counter attack on ramgopal varma - Sakshi - Sakshi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నంది అవార్డుల సందర్బంగా చెలరేగిన వివాదం మరింత ముదురుతోంది. ముఖ్యంగా నంది అవార్డుల ఎంపికపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్‌వర్మతో పాటు ఇతరులపైనా  తాజాగా మరో దర్శకుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. 

నంది అవార్డుల జ్యూరీకి ఆస్కార్‌ ఇవ్వాలన్న రాంగోపాల్‌ వర్మపై  జ్యూరీ  సభ్యుడు, దర్శకుడు మద్దినేని రమేష్‌ బాబు కౌంటర్‌ ఎటాక్‌ చేశారు. అంతేకాదు  మీడియా సమావేశం ద్వారా నంది అవార్డులపై నిరసన వ్యక్తం చేసిన ఇతర దర్శక నిర్మాతలపై కూడా  సెటైర్లు వేశారు.  ఫేస్‌బుక్‌  పోస్ట్‌ ద్వారా తన ఆగ్రహాన్ని  ప్రకటించారు. దీంతో ఇది వైరల్‌గా మారింది.

మద్దినేని రమేష్‌ బాబు ఫేస్‌బుక్‌ పోస్ట్‌ ఇలా ఉంది..యథాతథంగా..

నంది అవార్డ్స్ కమిటీలకు అవార్డ్స్ ఇవ్వాలన్న దర్శకుడా... తెలుగులో సినిమా తీయనని పారిపోయి ముంబై వెళ్ళి అక్కడ మాఫీయాకి జడిసి మళ్లీ తెలుగులో సినిమా తీసిన నువ్వా మాట్లాడేది ... నందమూరి తారకరామారావు గారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు నువ్వు నంది తీసుకున్నప్పుడు నీకు అప్పటి కమిటీ మీద ఇలాంటి ఫీలింగ్ కలగలేదా ... ఈ సమాజం మీద నాకు భాద్యత లేదని కుటుంబ వ్యవస్థ మీద గౌరవం లేదని ప్రకటించిననీకు నంది అవార్డ్స్ మీ మాత్రం భాద్యత గౌరవం వచ్చాయా.. తెలుగుజాతి ఖర్మ ... నిజాయితీగా పనిచేసిన మా 2016కమిటీ గురించి మాత్ర్లడీతవె ఒప్పుకోం...దేశంలో ఇన్నిరకాల జడ్యాలు పెడదోరనులు వ్యత్యాసాలు అంటరానితరాలు వుంటేకనపడవు కోట్లుకు కోట్లు నిర్మాతల సొమ్ముతింటూ వాళ్లను కనీసం మనుషులుగా గుర్తించని లకుటుంబాలకు వీధొక భానిస బఫూన్ 
ప్రయివేట్ సెక్యూరిటీ లేకపోతే బయటకు వెళ్లలేని బతుకు నీదొ అ్ ఇంకోసారి నంది కమిటీల గురించి మాట్లాడితే ఖబద్దార్‌.. బక్కగాల్లకీ బలుసుగాల్లాకీ బలుపుగాల్లకీ బఫూన్గాల్లకీ ఇక్కడెవడూ బయపడెవారు లేరు ... ఖబడ్దార్.. మీ తోక  వూపుడు పిల్లల దగ్గర చుపండి పులుల దగ్గర కాదు.

 

రమేష్‌ పోస్ట్‌పై వర్మ మరోసారి ఘాటుగా స్పందించారు. ఒక ప్రజాస్వామ్య దేశంలో జరుగుతున్న ఒక విషయం మీద అభిప్రాయం వ్యక్తపరిచే హక్కు ఎవరికైనా ఉంటుందన్నారు. ఇలాంటి వ్యక్తులు జ్యూరీలో వుండటం  బాధాకరమన్నారు. ఇలాంటి వ్యక్తులని మెంబర్లుగా ఎన్నుకున్న ప్రభుత్వం పట్ల ఆశ్చర్యపడాలో జాలిపడాలో నాకు తెలియడం లేదు.......... అన్నం గురించి తెలియటానికి ఒక్క మెతుకు చాలంటారు. ఈ మద్దినేని రమేష్ బాబు ఆ మెతుకైతే అన్నం కమిటీ అనుకునే పరిస్తితి వచ్చినందుకు వివరణ ప్రభుత్వమే చెప్పాలంటూ ఫేస్‌బుక్‌  పోస్ట్‌లో ప్రశ్నించారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top