మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్ | Dialogues in 'Uttama Villain' penned by Kamal Haasan: Director | Sakshi
Sakshi News home page

మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్

Sep 5 2014 9:10 AM | Updated on Sep 19 2019 9:06 PM

మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్ - Sakshi

మళ్లీ పెన్ను పట్టనున్న కమల్ హాసన్

సకల కళ వల్లభుడు కమల్ హాసన్ మళ్లీ పెన్ను పట్టనున్నారు. కమల్ హాసన్ హీరోగా తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'.

చెన్నై: సకల కళ వల్లభుడు కమల్ హాసన్ మళ్లీ పెన్ను పట్టనున్నారు. కమల్ హాసన్ హీరోగా తాజాగా తమిళంలో తెరకెక్కుతున్న చిత్రం 'ఉత్తమ విలన్'. ఆ చిత్రానికి కమల్ మాటలు అందించనున్నారని ప్రముఖ నటుడు, ఆ చిత్ర దర్శకుడు రమేష్ అరవింద్ వెల్లడించారు. ఈ చిత్రానికి మాటలు రాసేందుకు ముందుగా క్రేజీ మోహన్ను అనుకున్నామని కానీ కమల్ను ఎంచుకున్నామని చెప్పారు.

మాటల రచయితగా కమల్ వంద శాతం న్యాయం చేస్తారని ఆయన చెప్పారు. ఈ చిత్రంలో కమల్ హాసన్ ద్విపాత్రాభినయం చేయనున్నారని ఆయన వివరించారు. మలయాళంలో రూపొందించిన దృశ్యం చిత్రం రీమేక్ పాపనాశమా తమిళ థ్రిల్లర్లో నటిస్తూ కమల్ యమా బిజీగా ఉన్నారని రమేష్ అరవింద్ చెప్పారు.   
 

Advertisement
 
Advertisement
Advertisement