డై..లాగి కొడితే.... | Dialog from ganesh movie | Sakshi
Sakshi News home page

డై..లాగి కొడితే....

Nov 2 2016 11:30 PM | Updated on Jul 29 2019 7:35 PM

డై..లాగి కొడితే.... - Sakshi

డై..లాగి కొడితే....

ఆరోగ్యశాఖ మంత్రి అయిన సాంబశివుడు (కోట) తన పలుకుబడితో అక్రమాలు చేస్తుంటాడు.

సినిమా : గణేష్
రచన: పరుచూరి బ్రదర్స్,
దర్శకత్వం: తిరుపతి స్వామి

ఆరోగ్యశాఖ మంత్రి అయిన సాంబశివుడు (కోట) తన పలుకుబడితో అక్రమాలు చేస్తుంటాడు. ఆయన చేస్తున్న అవినీతి, అక్రమాలను ఆధారాలతో సహా ఒక ఫైల్ తయారు చేస్తాడు గణేష్ (వెంకటేష్). ఆ ఫైల్ కోసం సాంబశివుడు గొడవ చేస్తుంటాడు. ఆయన దగ్గరకు వచ్చిన గణేష్... ‘పెన్నుతో చచ్చే బచ్చాగాడివి నీకెందుకురా బుల్లెట్లు. ముచ్చు మొహం చచ్చు వెధవ. అసలు ఫైల్ ఎక్కడుందా అని చవటలాగా చమటలు తుడుచుకుంటున్నావా? ఆ ఫైల్ నా దగ్గర ఉందిరా. ఆడపిల్ల దగ్గర చూపించడం కాదురా నీ చచ్చు మగతనం. నీకు దమ్ముంటే.. ఒక అబ్బకు పుట్టినవాడివైతే రారా నా ఇంటికి. లేదా చెప్పు.. చౌరస్తాలో గిరి గీసి ఫైల్ అక్కడ పెడతాను’
 ‘ఎనీ సెంటర్.. సింగిల్ హ్యాండ్ గణేష్’
 
 అని సాంబశివుడికి వార్నింగ్ ఇస్తాడు గణేష్. అప్పట్లో ఈ డైలాగ్‌ను చాలామంది ఇమిటేట్ చేసేవాళ్లు.
 

Advertisement
 
Advertisement
Advertisement