'ధృవ' ఫస్ట్ లుక్ విడుదల | Dhruva First Look released | Sakshi
Sakshi News home page

'ధృవ' ఫస్ట్ లుక్ విడుదల

Aug 15 2016 3:25 PM | Updated on Sep 4 2017 9:24 AM

'ధృవ' ఫస్ట్ లుక్ విడుదల

'ధృవ' ఫస్ట్ లుక్ విడుదల

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'ధృవ' ఫస్ట్ లుక్ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తాజా చిత్రం 'ధృవ' ఫస్ట్ లుక్ను సోమవారం మధ్యాహ్నం విడుదల చేశారు. ఈ పోస్టర్లో చెర్రీ స్టైలిష్గా కనిపిస్తున్నాడు. చరణ్ గత చిత్రాలు కాస్త నిరాశ పరచడంతో మెగా ఫ్యాన్స్ 'ధృవ' మీద ఆశలు పెట్టుకున్నారు. తమిళ్ ‘తని ఒరువన్’కు రీమేక్గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. గీతా ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్ర షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.

ఈ చిత్రంలో చరణ్.. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా అలరించనున్నాడు. తమిళ వెర్షన్‌లో విలన్‌గా చేసిన ప్రముఖ తమిళ నటుడు అరవింద స్వామి తెలుగులో కూడా చెర్రీకి విలన్గా నటిస్తున్నాడు. చరణ్ సరసన రకుల్ ప్రీత్సింగ్ హీరోయిన్గా నటిస్తోంది. దసరా కానుకగా ఈ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement