అది యాక్సిడెంట్‌ కాదు సార్‌.. మర్డర్‌! | Dhrusti Movie Teaser Release | Sakshi
Sakshi News home page

అది యాక్సిడెంట్‌ కాదు సార్‌.. మర్డర్‌!

Oct 20 2017 11:40 PM | Updated on Oct 21 2017 3:36 AM

Dhrusti Movie Teaser Release

...ఈ డైలాగుతో ప్రారంభమయ్యే ‘దృష్టి’ టీజర్‌ సినిమాపై  ఆసక్తి పెంచుతోంది! ‘ఎందుకురా... మర్డర్‌ చేశావ్‌!’, ‘ఏ మాట్లాడుతున్నారు సార్‌... ప్రూఫ్‌ లేకుండా మాట్లాడటం కరెక్ట్‌ కాదు’... వంటి డైలాగుల్ని బట్టి చూస్తే సినిమా హత్య నేపథ్యంలో ఉంటుందని తెలుస్తోంది. రాహుల్‌ రవీంద్రన్, పావనీ గంగిరెడ్డి జంటగా, ‘వెన్నెల’ కిశోర్‌ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం ‘దృష్టి’.

శ్రీనివాస్‌ మోతుకూరి సమర్పణలో రామ్‌ అబ్బరాజు దర్శకత్వంలో మోహన్‌ నిర్మిసున్నారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను గాయని, రాహుల్‌ సతీమణి చిన్మయి విడుదల చేశారు. రామ్‌ అబ్బరాజు మాట్లాడుతూ– ‘‘ఇలాంటి కథలు ఒప్పుకోవడానికి హీరోలకు ధైర్యం ఉండాలి. ఆ విషయంలో రాహుల్‌కు థ్యాంక్స్‌ చెప్పాలి’’ అన్నారు.

‘‘నేనెప్పటి నుంచో కొత్తగా సినిమా చేయాలనుకుంటున్న టైమ్‌లో రామ్‌ నాకు ‘దృష్టి’ కథ చెప్పాడు. నచ్చడంతో ఓకే చెప్పేశా’’ అన్నారు రాహుల్‌ రవీంద్రన్‌. ‘‘పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ప్రీ–రిలీజ్‌ ఫంక్షన్‌ జరిపి, సినిమా రిలీజ్‌కు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు మోహన్‌.

Advertisement
 
Advertisement
Advertisement