ప్రముఖ సింగర్ చిన్మయి శ్రీపాద ఎపిసోడ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆమె భర్త రాహుల్ రవీంద్రన్ చేసిన కామెంట్స్‌పై పెద్దఎత్తున చర్చ మొదలైంది. మంగళసూత్రం ధరించడమనేది చిన్మయి ఇష్టమని.. తానైతే తప్పనిసరిగా వేసుకోవాలని చెప్పనని అన్నారు. ఈ కామెంట్స్‌పై కొందరు నెటిజన్స్ విమర్శించగా.. మరికొందరు సమర్థించారు. దీంతో రాహుల్, చిన్మయి జంటపై సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి.
దీంతో తమపై పెద్దఎత్తున ట్రోల్స్ రావడంతో సింగర్ చిన్మయి స్పందించింది. ఆయన ఏందో ఒక సందర్భంలో అలా మాట్లాడారని తెలిపింది. అదే ఇప్పుడు చర్చకు కారణమైంది. నిజం చెప్పాలంటే ఇప్పుడు జరుగుతున్న చర్చపై నాకు ఎలాంటి ఇబ్బంది లేదని పేర్కొంది. కానీ మనదేశంలోని మహిళల గురించే ఆందోళన చెందుతున్నానన నెటిజన్లకు కౌంటరిచ్చింది.
(ఇది చదవండి: నా భార్యకు తాళి వేసుకోవద్దనే చెబుతా: రాహుల్ రవీంద్రన్)
ఓ నెటిజన్ చిన్మయి- వైరముత్తు ఎపిసోడ్‌పై ప్రశ్నించాడు. వైరముత్తు నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు.. కానీ ఇక్కడ ఇతర మహిళల గురించి ఆందోళన చెందుతున్నారని వ్యంగ్యంగా కామెంట్ చేశాడు. దీనిపై చిన్మయి స్పందిస్తూ..అవును.. ఎందుకంటే లైంగిక వేధింపులకు గురి కావడం నా తప్పే.. కానీ మీలాంటి పురుషులు నా లైంగిక వేధింపుల ఎపిసోడ్ గురించి ఎందుకు ప్రస్తావించాలి? దయచేసి ఢిల్లీ గాలిని పీల్చుకోండి.. ఎందుకంటే నేను అలాంటి గాలిని తట్టుకోలేనంటూ తనదైన శైలిలో ఇచ్చిపడేసింది. కాగా.. 2018లో మీటూ ఉద్యమం సమయంలో ఓ ఈవెంట్‌లో వైరముత్తు తనను లైంగికంగా వేధించాడని ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత దాదాపు 20 మంది మహిళలు ఆతనిపై ఆరోపణలు చేశారు.
కాగా.. సింగర్ చిన్మయి, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఏడాది డేటింగ్ తర్వాత 2014లో వివాహం చేసుకున్నారు. ఈ జంటకు జూన్ 2022లో కవలలు జన్మించారు. ప్రస్తుతం రాహుల్ దర్శకత్వంలో తెరకెక్కించిన ది గర్ల్‌ఫ్రెండ్ మూవీ నవంబర్ 7న రిలీజ్ కానుంది.
He literally said it in some context on an interview which has become a tweet. The rage from the men calling him all sorts of abuses - I am worried for the women here truth be told
— Chinmayi Sripaada (@Chinmayi) November 4, 2025


