breaking news
Mangala Suthra
-
మంగళసూత్రం మింగిన గేదె.. ఐదోతనం కాపాడిన వైద్యుడు!
మహారాష్ట్రలోని వాశిం జిల్లాలో ఒక వింత ఉదంతం చోటుచేసుకుంది. ఈ ప్రాంతానికి చెందిన ఒక గేదె రూ. 15 లక్షల విలువైన మంగళసూత్రం మింగేసింది. పశువైద్యులు ఆ గేదె కడుపులోని మంగళ సూత్రం తీసేందుకు దాని కడుపును కోశారు. మంగళసూత్రం బయటకు తీశాక ఆ గేదెకు 65 కుట్లు వేశారు. జిల్లాలోని సార్సీ గ్రామంలో ఈ ఉదంతం చోటుచేసుకుంది. రామ్‌హరీ అనే రైతు భార్య స్నానం చేసే ముందు తన మంగళ సూత్రాన్ని తీసి, సోయాబీన్ తొక్కలు ఉన్న ఒక పాత్రలో పెట్టింది. స్నానం పూర్తయ్యాక, ఆ ప్లేట్‌ను తమ పశువులశాల లోని గేదె ముందు ఉంచి, ఇంటిపనులలో మునిగిపోయింది. రెండు గంటల తరువాత తన మెడలో మంగళ సూత్రం లేని విషయాన్ని ఆమె గమనించింది. కొద్దిసేపు ఇటునటు వెదికాక తాను ఆ మంగళ సూత్రాన్ని సోయా తొక్కలున్న ప్లేట్లో పెట్టినట్లు గుర్తుకు తెచ్చుకుంది. వెంటనే ఆమె పరిగెత్తుకుంటూ పశువులశాలలోకి వెళ్లి చూసింది. గేదె తన మంగళసూత్రం మింగేసిందని గ్రహించింది. వెంటనే ఈ విషయాన్ని ఆమె భర్తకు తెలియజేసింది. రైతు రామ్‌హరీ ఈ విషయాన్ని ఫోనులో పశువైద్యాధికారి బాలాసాహెబ్‌కు తెలియజేశాడు. అతని సూచన మేరకు ఆ రైతు తన గేదెను వాశింలోని పశువైద్యశాలకు తీసుకు వెళ్లాడు. అక్కడ పశువైద్యాధికారి మెటల్ డిటెక్టర్‌తో ఆ గెదె కడుపులో మంగళసూత్రం ఉన్నదని నిర్ధారించారు. తరువాత దానికి ఆపరేషన్ చేసి, మంగళ సూత్రాన్ని బయటకు తీశారు. ఈ ఆపరేషన్ 2 గంటలపాటు సాగింది. తరువాత వైద్యుదు ఆ గేదెకు 65 కుట్లు వేశారు. కాగా తన మంగళసూత్రాన్ని గేదె కడుపు నుంచి వెలికి తీసి, తన ఐదోతనం కాపాడారంటూ ఆ రైతు భార్య వైద్యునికి కృతజ్ఞతలు తెలియజేసింది. ఇది కూడా చూడండి: పాక్ ప్రధాని జీతం ఎంత? అదనపు సౌకర్యాలు ఏముంటాయి? -
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన నేత
-
ఆశీర్వాదం అడిగితే.. తాళి కట్టబోయిన బీజేపీ నేత
చెన్నై (తమిళనాడు): బీజేపీ సీనియర్ నాయకుడు సుబ్రమణ్యస్వామి పరధ్యానంలో పచ్చని పెళ్లి పందిట్లో కలకలం రేపారు. తమిళనాడులోని తిరునల్వెలిలో బుధవారం ఆయన ఓ పెళ్లికి హాజరయ్యారు. తాళిబొట్టును తన చేతుల మీదుగా వరుడికి అందించాలని పెద్దలు కోరగా అందుకు ఆయన అంగీకరించారు. పరధ్యానంలో ఉన్న ఆయన తాళి బొట్టును తీసుకొని ఏకంగా పెళ్లికూతురు మెడలో కట్టేందుకు ప్రయత్నించగా చుట్టుపక్కల వారికి అక్కడ ఏం జరుగుతుందో కొన్ని క్షణాలు అర్థం కాలేదు. వెంటనే తేరుకున్న ఓ పెద్దావిడ మంగళసూత్రం కట్టకుండా ఆయనను నిలువరించింది. తాను పరధ్యానంతో చేసిన చర్యకు స్వామి కాస్త సిగ్గుపడి నవ్వుకున్నారు. ఆయన చర్యలతో పెళ్లికి వచ్చిన అతిథులు, వధూవరుల కుటుంబసభ్యులు ఈ సంఘటనతో షాక్ తిన్నారు.