ఆ సినిమా రీమేక్ చేయాలనుంది : ధనుష్ | Dhanush want to Remake barfi | Sakshi
Sakshi News home page

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది : ధనుష్

Jul 28 2017 3:10 PM | Updated on Sep 5 2017 5:05 PM

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది : ధనుష్

ఆ సినిమా రీమేక్ చేయాలనుంది : ధనుష్

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన

బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ బర్ఫీ ని కోలీవుడ్ రీమేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు. 2012లో రిలీజ్ అయిన ఈ సినిమాలో  రణ్‌బీర్‌ కపూర్‌, ప్రియాంక చోప్రా, ఇలియానాలు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాను తమిళ స్టార్ హీరో ధనుష్ రీమేక్‌ చేసే ఆలోచనలో ఉన్నాడు. ఇప్పటికే నటుడిగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ధనుష్ మరో అవార్డు విన్నింగ్ పర్ఫామెన్స్ తో ఆకట్టుకోనున్నాడు. ఇటీవల కాలంలో దక్షిణాది సినిమాలే ఎక్కువగా బాలీవుడ్ లో రీమేక్ అవుతుండగా.. ధనుష్ మాత్రం నార్త్ సినిమాను సౌత్ ప్రేక్షకులకు చూపించనబోతున్నాడు.

ధనుష్‌ హీరోగా తెరకెక్కిన విఐపి 2 ప్రమోషన్ లో భాగంగా ధనుష్ తన మనసులో మాట బయట పెట్టాడు. విఐపి 2 తమిళ్ తో పాటు తెలుగు, హిందీ భాషల్లోనూ భారీగా రిలీజ్ అవుతోంది. ప్రస్తుతం ముంబైలో సినిమా ప్రమోషన్ లో బిజీగా ఉన్న ధనుష్ మీడియాకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో భాగంగా తనకి బర్ఫీ చిత్రాన్ని రీమేక్‌ చేయాలనుందని తెలిపారు. ఈ సినిమాలో రణ్‌బీర్‌ నటన అద్భుతంగా ఉంటుందని, కుదిరితే ఈ సినిమాను తమిళంలో రీమేక్‌ చేసి అందులో తానే నటిస్తానని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement