డైరీ ఖాళీ లేదు | Dhanush takes The Extraordinary Journey of The Fakir | Sakshi
Sakshi News home page

డైరీ ఖాళీ లేదు

May 25 2018 5:15 AM | Updated on May 25 2018 5:15 AM

Dhanush takes The Extraordinary Journey of The Fakir - Sakshi

‘డైరీ అస్సలు ఖాళీ’ లేదు అంటున్నారు తమిళ హీరో ధనుష్‌. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా 2018 షెడ్యూల్‌ మొత్తం బిజీగా ఉండబోతోందట. ప్రస్తుతం హాలీవుడ్‌ డెబ్యూ మూవీ ‘ది ఎక్స్‌ట్రార్డినరీ జర్నీ అఫ్‌ ది ఫకీర్‌’  ప్రమోషన్‌లో బిజీగా ఉన్నారు. దాని తర్వాత మామ రజనీకాంత్‌ హీరోగా తాను నిర్మించిన ‘కాలా’ సినిమా రిలీజ్‌ పనుల్లో మునిగిపోతారట. ఆ వెంటనే నటుడిగా మారిపోయి బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సూపర్‌ హిట్‌ మూవీ ‘మారీ’ సీక్వెల్‌ ‘మారీ 2’ లాస్ట్‌ షెడ్యూల్‌లో జాయిన్‌ అయి, ఆగస్ట్‌ కల్లా కంప్లీట్‌ చేస్తారట. ఆ తర్వాత డైరెక్టర్‌గా తన సెకండ్‌ మూవీను స్టార్ట్‌ చేస్తారట. ఈ పీరియాడికల్‌ మూవీని శ్రీ తేనాండాళ్‌ ఫిల్మ్స్‌ నిర్మించనుంది. సో.. ఈ ఇయర్‌ అంతా నటుడిగా, నిర్మాతగా, డైరెక్టర్‌గా ధనుష్‌ డైరీ ఫుల్‌ బిజీ అన్నమాట. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement