తెలుగు పాట పాడిన తమిళ హీరో | Dhanush sings for Sai Dharam Tej | Sakshi
Sakshi News home page

తెలుగు పాట పాడిన తమిళ హీరో

Jul 20 2016 9:34 AM | Updated on Sep 4 2017 5:29 AM

తెలుగు పాట పాడిన తమిళ హీరో

తెలుగు పాట పాడిన తమిళ హీరో

గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మరోసారి అలాంటి కాంబినేషన్ నే సెట్ చేశాడు. మెగా హీరో సాయి...

గతంలో కన్నడలో పునీత్ రాజ్ కుమార్ హీరోగా తెరకెక్కిన సినిమా కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్తో పాట పాడించిన మ్యూజిక్ డైరెక్టర్ తమన్, మరోసారి అలాంటి కాంబినేషన్ నే సెట్ చేశాడు. మెగా హీరో సాయి ధరమ్ తేజ్ లేటెస్ట్ మూవీ తిక్క. ప్రస్తుతం ఆఖరి షెడ్యూల్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కోసం తమిళ స్టార్ హీరో ధనుష్ పాట పాడాడు.

ఇప్పటి వరకు తమిళ  పాటలు మాత్రమే పాడిన ధనుష్ తొలిసారిగా తిక్క సినిమా కోసం తమన్ సంగీత సారధ్యంలో తెలుగు పాట పాడాడు. ఇప్పటికే కోలీవుడ్ లో కొలవర్రీ పాటతో సెన్సేషన్ సృష్టించిన ధనుష్, ఇప్పుడు తిక్క బేబి అంటూ సాగే పాటతో తెలుగు నాట కూడా అదే మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

 

Advertisement
 
Advertisement
Advertisement