చూపు లేని పాత్రపై కన్ను | Dhanush to produce Tamil remake of Ayushmann | Sakshi
Sakshi News home page

చూపు లేని పాత్రపై కన్ను

Jun 7 2019 12:52 AM | Updated on Jun 7 2019 12:52 AM

Dhanush to produce Tamil remake of Ayushmann - Sakshi

ధనుష్‌

2018లో బాలీవుడ్‌లో సూపర్‌ హిట్‌గా నిలిచిన చిత్రాల్లో శ్రీరామ్‌ రాఘవన్‌ తెరకెక్కించిన ‘అంధాధూన్‌’ చిత్రం ఒకటి. ఆయుష్మాన్‌ ఖురానా అంధ పియానో ప్లేయర్‌ పాత్రలో కనిపించారు. ఇక్కడే కాదు, చైనాలోనూ ఈ సినిమా రికార్డ్‌ కలెక్షన్స్‌ నమోదు చేసింది. ఈ సినిమాను తమిళంలో రీమేక్‌ చేసే ఆలోచన ఉందని ధనుష్‌ పేర్కొన్నారు. ‘‘2009 నుంచి రీమేక్‌ సినిమాల్లో నటించడం తగ్గించాను. కానీ ‘అంధాదూన్‌’ చాలా అద్భుతమైన సినిమా. ఆల్రెడీ ఈ రీమేక్‌ రైట్స్‌ తీసుకునే ప్రయత్నాల్లో మా టీమ్‌ ఉంది. ఇలాంటి అద్భుతమైన థ్రిల్లర్స్‌ను తమిళ ప్రేక్షకులకు తప్పకుండా చూపించాలనే ఉద్దేశంతోనే రీమేక్‌ చేయాలనుకున్నాను’’ అని పేర్కొన్నారు. హిందీ సినిమా చూసినవాళ్లకు ఇందులో హీరో చూపు లేనివాడు అనే విషయం తెలిసే ఉంటుంది. ధనుశ్‌లో మంచి నటుడు ఉన్నాడు. ఈ పాత్రను అద్భుతంగా చేయగలరని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

Advertisement
 
Advertisement
Advertisement