కోలీవుడ్‌ హీరో హాలీవుడ్‌ మూవీ పోస్టర్‌ | Dhanush Hollywood Movie Poster | Sakshi
Sakshi News home page

కోలీవుడ్‌ హీరో హాలీవుడ్‌ మూవీ పోస్టర్‌

Nov 2 2017 1:31 PM | Updated on Nov 2 2017 1:31 PM

Dhanush Hollywood Movie Poster - Sakshi

కోలీవుడ్‌ స్టార్‌ హీరో ధనుష్‌ ఓ హాలీవుడ్‌ సినిమాలో నటిస‍్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సౌత్‌ తోపాటు  బాలీవుడ్‌ లోనూ నటుడిగా నిరూపించుకున్న ధనుష్‌, త్వరలో హాలీవుడ్‌ లో సత్తా చాటనున్నాడు. తాజాగా ధనుష్‌ నటిస్తున్న హాలీవుడ్‌ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ రిలీజ్‌ అయ్యింది. ‘ది ఎక్సట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్’ పేరుతో తెరకెక్కుతున్న  సినిమాలో ధనుష్‌ లుక్‌ కు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. ఈ సినిమాలో ధనుష్‌ భారత్‌కు చెందిన ఒక కళాకారుడు ‘అజా’గా కనిపించబోతున్నాడు.

ది ఎక్సట్రార్డినరీ జర్నీ ఆఫ్ ది ఫకిర్ అనే ప్రముఖ నవల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. హాలీవుడ్‌ మేకర్‌ కెన్‌ స్కాట్‌ఈ సినిమాకు దర్శకుడు. ధనుష్‌ తోపాటు  హాలీవుడ్‌ స్టార్స్‌ కిల్‌ బిల్‌ ఫేం ఉమా థుర్మాన్‌, పెర్సీ జాక్సన్‌ లు ఈ సినిమాలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాల్లో జరుపుకుంటున్న ఈ సినిమాను త్వరలో  రిలీజ్‌ చేసేందుకు ప‍్లాన్‌ చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement