కొత్త ఉత్తేజం | Dhanush Gives a Big Hug to Prabhu Deva | Maari 2 | Sakshi
Sakshi News home page

కొత్త ఉత్తేజం

Aug 5 2018 2:22 AM | Updated on Aug 5 2018 2:22 AM

Dhanush Gives a Big Hug to Prabhu Deva | Maari 2 - Sakshi

ప్రభుదేవా,ధనుష్‌

ముందు ప్రభుదేవా వేసి చూపించిన స్టెప్‌కి ధనుష్‌ కాలు కదిపారు. టైమింగ్‌ కుదర్లేదట. నెక్ట్స్‌ ఆ డ్యాన్స్‌ మూమెంట్‌లోని ట్రిక్‌ను ధనుష్‌కు చెప్పారు ప్రభుదేవా. అంతే..సేమ్‌ టు సేమ్‌ స్టెప్‌ వచ్చేసింది. ‘మారి 2’ సినిమా సెట్‌లో ఇదంతా జరిగింది. బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో ధనుష్‌ హీరోగా రూపొందుతోన్న సినిమా ‘మారి 2’. ఇందులో సాయి పల్లవి కథానాయికగా నటిస్తున్నారు.

మూడేళ్ల క్రితం బాలాజీ మోహన్, ధనుష్‌ కాంబినేషన్‌లోనే వచ్చిన ‘మారి’ చిత్రానికి సీక్వెల్‌ ఇది. శుక్రవారంతో ఈ సినిమాలోని ఓ సాంగ్‌ను కంప్లీట్‌ చేశారు. ఈ సాంగ్‌కు ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. ‘‘ డ్యాన్సింగ్‌ లెజెండ్‌ ప్రభుదేవాగారి కొరియోగ్రఫీలో ‘మారి 2’ కోసం ఓ సాంగ్‌ను కంప్లీట్‌ చేశాం. ఆయన ప్రోత్సాహం మాలో కొత్త ఉత్తేజాన్ని నింపింది. థ్యాంక్స్‌ సర్‌’’ అని ప్రభుదేవా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని డిసెంబర్‌లో విడుదల చేయాలని చిత్రబృందం ప్లాన్‌ చేస్తున్నారట.

Advertisement
 
Advertisement
Advertisement