అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా | Deva Katta narrates a love story to Akhil Akkineni | Sakshi
Sakshi News home page

అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా

Jul 4 2014 12:01 AM | Updated on Sep 2 2017 9:46 AM

అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను  :దేవా కట్టా

అఖిల్‌కి మంచి ప్రేమకథ చెప్పాను :దేవా కట్టా

‘‘అఖిల్‌కి ఓ మంచి ప్రేమకథ చెప్పాను. తనకు నచ్చింది. వేరే దర్శకుల దగ్గర కూడా అఖిల్ రెండు కథలు విన్నారు. ఏ సినిమా ముందు ఉంటుందో చెప్పలేను’’ అని దేవా కట్టా చెప్పారు.

 ‘‘అఖిల్‌కి ఓ మంచి ప్రేమకథ చెప్పాను. తనకు నచ్చింది. వేరే దర్శకుల దగ్గర కూడా అఖిల్ రెండు కథలు విన్నారు. ఏ సినిమా ముందు ఉంటుందో చెప్పలేను’’ అని దేవా కట్టా చెప్పారు. నాగచైతన్య, సమంత జంటగా ఆయన దర్శకత్వం వహించిన ‘ఆటోనగర్ సూర్య’ ఇటీవల విడుదలైన విషయం తెలిసిందే. తొలి రోజు టాక్ తర్వాత ఈ చిత్రంలోని పన్నెండు నిమిషాల సన్నివేశాలను కత్తిరించి, నిడివి తగ్గించారు. నిడివి తగ్గిన తర్వాత మంచి ఆదరణ లభిస్తోందని దేవా కట్టా చెప్పారు. ఈ చిత్రంలోని సంభాషణలకు మంచి స్పందన లభిస్తోందని చెప్పారు. ప్రజలను ప్రభావితం చేసే కథలతో సినిమాలు తీయాలనుకుంటానని, సహజత్వానికి దూరంగా సినిమాలు చేయనని దేవా ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన దర్శకత్వంలో మరో సినిమా చేయాలనే ఆకాంక్షను సమంత వెలిబుచ్చిన నేపథ్యంలో, ఆమెతో ‘ఏ మాయ చేశావె’వంటి ప్రేమకథా చిత్రం చేయాలనుకుంటున్నా అని తెలిపారు
 

Advertisement
 
Advertisement
Advertisement