బెంగాలీ ‘మగధీర’!
తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య హిందీ పరిశ్రమ వారి దృష్టి మాత్రం మన సినిమాల మీదే ఉంది.
తెలుగులో ఘనవిజయం సాధించిన చిత్రాలు ఇతర భాషల్లో రీమేక్ అవుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఈ మధ్య హిందీ పరిశ్రమ వారి దృష్టి మాత్రం మన సినిమాల మీదే ఉంది. పోకిరి, విక్రమార్కుడు, రెడీ, కిక్.. ఇలా ఇటీవలి కాలంలో హిందీలో రీమేక్ అయిన తెలుగు సినిమాల జాబితా చాలానే ఉంది. ఒక్క హిందీ మాత్రమే కాకుండా ఉత్తరాదిన బెంగాలీ పరిశ్రమ దృష్టి కూడా టాలీవుడ్‌పై ఉన్నట్లుంది. ఎందుకంటే, రాజమౌళి దర్శకత్వంలో రామ్‌చరణ్, కాజల్ అగర్వాల్ జంటగా రూపొందిన బ్లాక్‌బస్టర్ మూవీ ‘మగధీర’ బెంగాలీ భాషలో రీమేక్ అవుతోంది. దేవ్, మిమి చక్రబర్తి జంటగా రూపొందుతోన్న ఈ చిత్రానికి ‘రాజ్ చక్రబర్తి’ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రం కోసం దేవ్ గుర్రపు స్వారీ నేర్చుకున్నారు. అలాగే సిక్స్ ప్యాక్‌లో కనిపించబోతున్నారు. తెలుగు పరిశ్రమను ‘టాలీవుడ్’ అంటామనే విషయం తెలిసిందే. బెంగాలీ పరిశ్రమను కూడా అదే పేరుతో పిలుస్తారు. దేవ్‌కి ‘కింగ్ ఆఫ్ టాలీవుడ్’ అనే పేరుంది. అక్కడ అత్యధిక పారితోషికం తీసుకునే హీరో దేవ్ అని సమాచారం.