రాంచరణ్ సరసన దీపికా పదుకోనె? | Deepika Padukone To pair Opposite Ram Charan? | Sakshi
Sakshi News home page

రాంచరణ్ సరసన దీపికా పదుకోనె?

Dec 30 2013 12:54 PM | Updated on Apr 3 2019 6:23 PM

రాంచరణ్ సరసన దీపికా పదుకోనె? - Sakshi

రాంచరణ్ సరసన దీపికా పదుకోనె?

'జంజీర్' రీమేక్ ఘోర పరాజయం జ్క్షాపకాల మదిలోంచి చెరిగిపోకముందే టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ్ మరోసారి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు.

'జంజీర్' రీమేక్ ఘోర పరాజయం జ్క్షాపకాల మదిలోంచి చెరిగిపోకముందే టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ్ మరోసారి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతన్న ఓ చిత్రాన్ని రెండవ చిత్రానికి రాం చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో రాంచరణ్ రెండవ చిత్రానికి లగాన్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించనున్నట్టు ముంబైకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. 2014 అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రంలో దీపికా పదుకోనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీపికా పదుకొనే పేరు ఇంకా ఖరారు కాలేదని తెలిసింది.
 
2013లో నాలుగు వరుస విజయాలతో క్వీన్ ఆఫ్ 2013 టైటిల్ ను సొంతం చేసుకున్న దీపికాను ఈ చిత్రంలో నటింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ లో వార్తలు వెలువుడుతున్నాయి.  అయితే ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రాంచరణ్ బిజీగా ఉండగా, గత కొద్దికాలంగా వాయిదాల మీద వాయిదా పడుతున్న ఎవడు చిత్రం జనవరి 12 విడుదలకు సిద్ధమవుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement