breaking news
Ashutosh Gowarikar
-
బుల్లితెర ‘ఎవరెస్ట్’కి రహమాన్ పాటలు!
హాలీవుడ్ చిత్రాలకు స్వరాలు సమకూర్చడం మొదలుపెట్టిన తర్వాత, ఏఆర్ రహమాన్ భారతీయ చిత్రాలకు సమయం కేటాయించలేనంత బిజీ అయిపోయారు. అయినప్పటికీ వీలు చేసుకుని తమిళ, హిందీ చిత్రాలకు స్వరాలందిస్తున్నారు. అంత బిజీగా ఉండే రహమాన్ ఓ బుల్లితెర షో కోసం పాటలివ్వడానికి అంగీకరించడం విశేషం. విషయంలోకి వస్తే... ప్రముఖ బాలీవుడ్ దర్శక, నిర్మాత అశుతోష్ గోవారీకర్ ‘ఎవరెస్ట్’ పేరుతో బుల్లితెర కోసం ఓ షో చేస్తున్నారు. ఈ షో కోసం పాటలివ్వాల్సిందిగా రహమాన్ని కోరారు. అశుతోష్ రూపొందించిన లగాన్, స్వదేశ్, జోధా అక్బర్ చిత్రాలకు సంగీతదర్శ కునిగా వ్యవహరించారు రహమాన్. అప్పటినుంచీ అశుతోష్‌తో ఆయనకు మంచి అనుబంధం కుదిరింది. అందుకే, ‘ఎవరెస్ట్’కి పాటలివ్వడానికి అంగీకరించారు. ఇప్పటికి టైటిల్ ట్రాక్ పూర్తి చేశానని, ఇతర పాటలకు తన మ్యూజిక్ స్కూల్లో ఉన్న స్టూడెంట్స్ చేసిన ట్యూన్స్‌ని కూడా వాడాలనుకుంటున్నానని రహమాన్ తెలిపారు. ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు బుల్లితెరకు చాలా క్రేజ్ ఉందని, టెలివిజన్ రంగంలో పెను మార్పులు వచ్చాయని రహమాన్ చెప్పారు. ఇదిలా ఉంటే.. దాదాపు 30 ఏళ్ల క్రితం ‘వండర్ బలూన్’ అనే టీవీ షోలో నటించారు రహమాన్. ఆ తర్వాత బుల్లితెరకు సమయం కేటాయించలేకపోయారు. ఇప్పుడు నటుడిగా కాకపోయినా.. సంగీతదర్శకుడిగా అయినా బుల్లితెరకు రావడం ఆనందంగా ఉందని ఆయన పేర్కొన్నారు. -
రాంచరణ్ సరసన దీపికా పదుకోనె?
'జంజీర్' రీమేక్ ఘోర పరాజయం జ్క్షాపకాల మదిలోంచి చెరిగిపోకముందే టాలీవుడ్ నటుడు రామ్ చరణ్ తేజ్ మరోసారి బాలీవుడ్ లో అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్దమయ్యాడు. బాలీవుడ్ లో భారీ బడ్జెట్ చిత్రంగా రూపొందుతన్న ఓ చిత్రాన్ని రెండవ చిత్రానికి రాం చరణ్ ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. బాలీవుడ్ లో రాంచరణ్ రెండవ చిత్రానికి లగాన్ దర్శకుడు అశుతోష్ గోవారికర్ దర్శకత్వం వహించనున్నట్టు ముంబైకి చెందిన ఓ ప్రముఖ దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. 2014 అక్టోబర్ లో సెట్స్ మీదకు వెళ్లే ఈ చిత్రంలో దీపికా పదుకోనే పేరును పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే దీపికా పదుకొనే పేరు ఇంకా ఖరారు కాలేదని తెలిసింది. 2013లో నాలుగు వరుస విజయాలతో క్వీన్ ఆఫ్ 2013 టైటిల్ ను సొంతం చేసుకున్న దీపికాను ఈ చిత్రంలో నటింపచేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని బాలీవుడ్ లో వార్తలు వెలువుడుతున్నాయి. అయితే ప్రస్తుతం కృష్ణ వంశీ దర్శకత్వంలో రాంచరణ్ బిజీగా ఉండగా, గత కొద్దికాలంగా వాయిదాల మీద వాయిదా పడుతున్న ఎవడు చిత్రం జనవరి 12 విడుదలకు సిద్ధమవుతోంది.