వెలుగు కచ్చితంగా వస్తుంది

Deepika Padukone penned letter sharing her depression struggles - Sakshi

స్క్రీన్‌పై కనిపించినట్టే హీరో హీరోయిన్లు ఎలాంటి సమస్యనైనా చిటికెలో పరిష్కరించుకుంటారు. అసలు సమస్యలనేవి వస్తే కదా వాళ్లకు అని ఊహించుకోవచ్చు. కానీ కెమెరాను వదిలి బయటకు వస్తే మేమూ సాధారణ మనుషులమే అంటున్నారు దీపికా పదుకోన్‌. కొంత కాలం క్రితం ఆమె డిప్రెషన్‌కు గురైన సంగతి తెలిసిందే. వెంటనే డాక్టర్లు, కౌన్సిలింగ్‌ సహాయంతో అందులోనుంచి బయటపడ్డారు. ఆ సమయంలో ఇలా మానసిక  ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాళ్లకు సహాయపడాలనే ఉద్దేశంతో ‘లివ్, లవ్, లాఫ్‌’ అనే సంస్థను ఏర్పాటు చేశారామె. ఈ విషయం మీద మరింత అవగాహన కోసం తన పెళ్లికి కొన్ని రోజుల ముందు ఓ లేఖను ప్రముఖ మేగజీన్‌ కోసం రాశారు దీపిక. ఆ లేఖలోని సారాంశం ఈ విధంగా...

‘‘2014 వేసవి కాలంలో నేను యాంగై్జటీ (ఆందోళన), క్లినికల్‌ డిప్రెషన్‌తో బాధపడుతున్నట్టు డాక్టర్స్‌ నిర్ధారించారు. మంచి మంచి డాక్టర్స్‌ వల్ల వెంటనే కోలుకోగలిగాను. నేను మానసిక ఆందోళనకు గురయ్యాక నాలా బాధపడేవారు లక్షల్లో ఉన్నారని తెలుసుకున్నాను. మానసిక వ్యాధితో ఇబ్బంది పడేవాళ్లు సహాయం తీసుకుంటారనే ఉద్దేశంతో ఈ విషయాన్ని మీడియా ముందు కూడా చెప్పాలనుకున్నాను. ఒత్తిడి, ఆందోళనకు  సంబంధించిన వాటి మీద అవగాహన కోసం జూన్‌ 2015లో ‘లివ్, లవ్, లాఫ్‌’అనే సంస్థను ఏర్పాటు చేశాను.

మానసిక వ్యాధి చుట్టూ ఉన్న అపోహలను తొలగించాలనుకున్నాను. మానసిక ఇబ్బందుల నుంచి బయటపడిన వాళ్ల ద్వారా ‘నాట్‌ షేమ్డ్‌’ అనే క్యాంపైన్‌ నడిపిస్తున్నాం. మానసిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఎవ్వరికైనా కనుచూపు మేరలో చీకటి మాత్రమే కనిపిస్తుందంటే వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే... మీరు ఒంటరిగా లేరు. సహాయం అనేది కచ్చితంగా లభిస్తుంది. స్టీఫెన్‌ ఫ్రై మాటల్లో చెప్పాలంటే...  వెలుగు అనేది కచ్చితంగా వస్తుంది’’ అంటాను.లివ్, లవ్, లాఫ్‌ దీపికా పదుకోన్‌.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top