ఇన్నాళ్లు ఈ విషయం సీక్రెట్‌గా ఉంచాం..!

Deepika Padukone And Ranveer Singh Got Engaged 4 Years Ago - Sakshi

దాదాపు ఆరేళ్లపాటు లవ్‌బర్డ్స్‌గా చక్కర్లు కొట్టిన దీపికా పదుకోన్‌, రణ్‌వీర్‌ సింగ్‌ ఈ ఏడాది నవంబర్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. ఇటలీలోని లోక్‌కోమాలో నవంబర్‌ 14, 15 తేదీల్లో దీప్‌వీర్‌ల వివాహం జరిగింది. అయితే తమ రిలేషన్‌ గురించి ఓ ఆసక్తికరమైన విషయం చెప్పి అభిమానులను ఆశ్చర్యానికి గురి చేశారు దీపిక. తనకు, రణ్‌వీర్‌కు నాలుగేళ్ల క్రితమే నిశ్చితార్థం జరిగిందని చెప్పారు దీపిక. కానీ ఇన్ని రోజులు ఈ విషయం గురించి రహస్యంగా ఉంచామన్నారు. ఫిలింఫేర్‌ మ్యాగజైన్‌ ఫోటో షూట్‌ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపిక ఈ విషయాలను వెల్లడించారు.

‘నాలుగేళ్ల క్రితమే మా ఇద్దరికి ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఇక ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలనిపించింది.. కాబట్టి ఇప్పుడు పెళ్లి చేసుకున్నాం’ అన్నారు. ఇక సినిమాల విషయానికోస్తే శుక్రవారం రణ్‌వీర్‌ నటించిన ‘సింబా’ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రోహిత్‌ శెట్టి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు ఇప్పటికే పాజిటీవ్‌ టాక్‌ వచ్చింది. మరోపక్క దీపిక ‘చపాక్‌’ అనే చిత్రంలో నటించబోతున్నారు. యాసిడ్‌ దాడి బాధితురాలు లక్ష్మీ అగర్వాల్‌ జీవితాధారంగా ఈ బయోపిక్‌ను మేఘనా గుల్జార్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో దీపిక లక్ష్మి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా దీపిక నిర్మాతగా మారనున్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top